బీజేపీ తెలంగాణ రాష్ట్ర (Telangana State) శాఖ తలపెట్టిన మహాధర్నా(Mahadharna)కు ఆర్మూర్ (Armoor) నియోజకవర్గ ప్రజలు భారీగా తరలిరావాలని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి (Mla Paidi Rakesh Reddy) పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం రేపు ఆదివారం హైదరాబాద్లోని ఇందిరాపార్క్ (Indira Park) వద్ద జరుగుతుందని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ (Congress Party) అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా హామీలను అమలుచేయట్లేదని విమర్శించారు. ‘రైతు భరోసా లేదు. రూ.4 వేల పెన్షన్ లేదు. ప్రతి మహిళకు రూ.2500 లేవు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా తులం బంగారం జాడ లేదు. కాంగ్రెస్ మాయ మాటల పాలనను ఎండగట్టేందుకు రైతులు, మహిళలు, నిరుద్యోగుల పక్షాన మహాధర్నా చేపట్టినట్లు చెప్పారు.
- Advertisement -
