Wednesday, February 11, 2026
Homeనల్లగొండYadadri | పూర్తిస్థాయి అందుబాటులోకి

Yadadri | పూర్తిస్థాయి అందుబాటులోకి

“శ్రీ శాంతా ఋష్యశృంగ అన్నప్రసాద కేంద్రం”

  • అత్యాధునిక హైజెనిక్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్
  • యాదాద్రి వచ్చే భక్తుల ఆకలి తీర్చుతున్న నిత్య అన్నదాన సత్రం
  • తిరుమల తిరుపతి తరహాలో తీర్చిదిద్దడానికి ప్రయత్నం:ఆలయ ఈవో వెంకట్రావు

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో నవంబర్ 30 వ తేదీన అధికారికంగా వినియోగంలోకి తీసుకువచ్చిన శ్రీ శాంత ఋష్యశృంగ అన్నప్రసాద కేంద్రం పూర్తిస్థాయిలో అమలులోకి వచ్చింది.తిరుమల తిరుపతి తరహాలో అత్యాధునిక ప్రమాణాలతో భక్తులకు ఉచితంగా, పరిశుభ్రంగా,అత్యుత్తమ నాణ్యత ప్రమాణాలతో అన్నప్రసాదాలను అందించేందుకు ప్రత్యేకంగా రూపకల్పన చేసిన నిత్యాన్నదాన సత్రంను వేగేశ్న ఫౌండేషన్ వారు దాదాపు రూ.21 కోట్ల వ్యయంతో ఆధునిక వసతులతో నిర్మించారు.

- Advertisement -

ఇందులో అత్యాధునిక కిచెన్ సదుపాయాలు,భారీ సామూహిక భోజన మండపం,వంట సామగ్రి, హైజీనిక్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మరియు భక్తుల కోసం సౌకర్యవంతమైన ఏర్పాటు చేయబడ్డాయి.అన్నదానాన్ని సాక్షాత్తు దైవ సేవగా భావిస్తారు.అందుకే యాదాద్రి కి వచ్చే భక్తులకు కడుపునిండా భోజనం పెట్టి పంపించాలని దేవస్థానం భావిస్తుందని ఆలయ ఈవో వెంకట్రావు స్పష్టం చేశారు. నూతనంగా ఏర్పాటు చేయబడిన అన్నదానం కాంప్లెక్స్ లో రెండు హాళ్లు నిర్మించబడ్డాయి.ఒక హాలుకు సుమారు నాలుగు వందల మంది మొత్తం రెండు హాళ్ళకు కలిపి ఎనిమిది వందల మంది భక్తులు కూర్చుని భోజనాలు చేసే విధంగా సౌకర్యం ఏర్పాటు చేశారు.

భోజనంలో అన్నం, పులిహోర, పచ్చడి, సేమ్యా, పప్పు, సాంబార్ పెరుగు, ఇలా రుచికరమైన పదార్థాలతో భక్తుల్ని సంతృప్తిపరిచే విధంగా దేవస్థానం వారు భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి వీటికి అయ్యే ఖర్చు అంతా దేవస్థానమే భరిస్తుంది.అన్న ప్రసాదానికి సంబంధించిన పాత స్కీం లే అమలవుతున్నాయని,ఎవరైనా దాతలు ముందుకు వస్తే స్వాగతిస్తామని ఈఓ వెంకట్రావు తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలకు,దాతృత్వ సేవా సంస్కృతికి,మరో మైలురాయి చేరినట్టుందని ఈవో స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారి కృపతో అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగుతాయని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News