- పాత్రికేయ రంగంలో తీవ్ర విషాదం
తెలుగు జర్నలిస్ట్ వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది.తెలంగాణ గళం పత్రిక నియోజకవర్గ విలేఖరి,సీనియర్ పాత్రికేయులు,ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు దేవపంగు బాబు (55) సోమవారం అనారోగ్యంతో ఖమ్మంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.మండలంలోని రఘునాథ పాలెం గ్రామానికి చెందిన ఆయన పాత్రికేయ వృత్తిలో గత 25 సంవత్సరాలుగా పలు పత్రికల్లో విలేకరిగా పని చేసి, జర్నలిజం రంగంలో తనదైన శైలిలో ముద్ర వేసి, నిబద్ధతతో వార్త సేకరణలో విశేష సేవలు అందించి ప్రజల విశ్వాసాన్ని సంపాదించి అందరి మన్ననలు పొందారు.
ఎంతో మంది యువ జర్నలిస్టులకు ప్రేరణగా నిలిచారు.సూర్య బాబు గా గుర్తింపు పొందిన ఆయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతు ఇవ్వాళ ఉదయం హఠాన్మరణం చెందటంతో ఆయన మరణ వార్త తెలుసుకున్న పాత్రికేయులు,అధికారులు,రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి చెందారు.వారి మరణంతో పాత్రికేయ లోకంలో తీరని లోటు ఏర్పడిందని పలువురు జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.పత్రిక విలేకరిగా,ప్రెస్ క్లబ్ కు ఆయన అందించిన సేవలను పాత్రికేయ సమాజం ఎప్పుడూ గుర్తుంచుకుంటుందని సహచర పాత్రికేయులు కన్నీటి పర్యంతం అయ్యారు.
