- ఫోర్జరీ సంతకాలతో నిధులు స్వాహా..
- కులం అడ్డు పెట్టుకుని విధులు..
- సత్వరమే విధుల నుండి తొలగించాలి..
- విద్యార్ధుల నోటి కాడి జావా ప్యాకెట్లు మాయం
- తక్షణమే క్రిమినల్ చర్యలు చేపట్టాలి..
- డిమాండ్ చేసిన కార్పొరేట్ విద్య నియంత్రణ జీ.ఏ.సి. రాష్ట్ర కార్యదర్శి, బోల్గురి ముకేష్..
నల్గొండ జిల్లా, మునుగోడు మండలం, ఎంపీపీఎస్ కోతులారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పోకబత్తి వివేకనందన్ విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టిస్తూ, అక్రమాల పుట్టగా మారారు. ఇతని ఆగడాలపై సమగ్ర విచారణ జరిపి, కఠినంగా శిక్షించాలని కోరుతూ 08 – 06 – 2026 నాడు నల్గొండ జిల్లా కలెక్టర్ కి ప్రజా సంఘాలు ఫిర్యాదు చేయడం జరిగింది..
హెడ్‌మాస్టర్‌పై సమగ్ర విచారణ నివేదికలో తీవ్రమైన ఆరోపణలు నమోదు అయినప్పటికీ ఇప్పట ìవరకు కఠిన చర్యలు లేకపోవడం ఆందోళన కలిగిస్తుందని ఆవే దన వ్యక్తం చేశారు. నివేదికలో ఫోర్జరీ, ఆర్థిక అవకతవకలు, ఆడిట్ అభ్యంతరాలు, ప్రభుత్వ నిధుల వినియోగంలో అక్రమాల పై ప్రస్తావిస్తూ క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కార్పొరేట్ విద్య నియంత్రణ జె.ఏ.సి. రాష్ట్ర కార్యదర్శి బోల్గురి ముకేష్ కోరారు.. సమాచారహక్కు చట్టం ద్వారా వెలుగుచూసిన అంశాలు విద్యా శాఖలో ఇతను చేస్తున్న అరాచకాలకు అద్దం పడుతున్నాయి.

ప్రధాన ఆరోపణలు :
విద్యా వ్యవస్థ నిర్వీర్యం : ప్రధానోపాధ్యాయుని బాధ్యతారాహిత్య ప్రవర్తన, అరాచక వైఖరిని భరించలేక విద్యార్థులు పాఠశాలకు రావాలంటేనే భయపడే స్థాయికి పరిస్థితి దిగజారింది. దీనివల్ల విద్యార్థుల సంఖ్య దారుణంగా తగ్గి కేవలం 8 కి పడిపోయింది. ఇది ప్రభుత్వ పాఠశాలల పట్ల ఇతని నిర్లక్ష్యానికి నిదర్శనం. అధి కార యంత్రాంగం అండతో, కులాన్ని అడ్డు పెట్టుకొని దౌర్జన్యం చేస్తున్నారు.. ఇతని అరాచకాలకు బయపడుతున్నారు.. స్థానిక స్థాయి అధికారుల అండదండలు ఉండటంతో ఇతని అరాచకా లకు అడ్డు అదుపు లేకుండా పోయింది. చట్టాన్ని, ఉన్నతాధికారు లను లెక్కచేయని ధీమాతో ఇతను వ్యవహరిస్తున్నారు.
నేరపూరిత ఫోర్జరీ, నిధుల లూటీ : పాఠశాల నిధులను కాజేసేందుకు తోటి ఉపాధ్యాయురాలి సంతకాన్ని ఫోర్జరీ చేయడం దారుణం. ఇది కేవలం అవినీతి మాత్రమే కాదు, ఐపీసీ సెక్షన్ 468, 471 కింద తీవ్రమైన క్రిమినల్ నేరం.
బోగస్ బిల్లుల దందా : జీ.ఎస్.టి., బిల్ నంబర్లు లేని నకిలీ రసీదులతో ఆడిట్ అధికారులను తప్పుదోవ పట్టించి, ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారు.
ఆస్తుల అపహరణ : దాతలు పాఠశాల అభివృద్ధికి ఇచ్చిన వస్తువులను (ఫ్యాన్లు, కుర్చీలు) సొంత ఇంటికి తరలించి, పాఠశాలను తన సొంత ఆస్తిగా మార్చుకున్నారు.
ఎఫ్.ఆర్.ఎస్. హాజరులో మోసం : బయోమెట్రిక్ హాజరు రిపోర్టులను ట్యాంపరింగ్ చేస్తూ, పాఠశాల వేళల్లో విధులకు గైర్హా జరు కావడంద్వారా విద్యాహక్కు చట్టాన్ని అవహేళన చేస్తున్నారు.
మా డిమాండ్ : ఒక బాధ్యతాయుతమైన ప్రధానోపాధ్యాయుడిగా ఉండాల్సిన వ్యక్తి, ఒక నేరస్థుడిలా వ్యవహరిస్తూ.. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెడుతున్నారు. కావున, జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని అత్యంత సీరియస్‌గా పరిగణనలోకి తీసు కోవాలి. ఒక ప్రత్యేక విచారణాధికారిని నియమించి, ఇతనిపై వెంటనే ఎఫ్.ఐ.ఆర్. నమోదు చేసి, సస్పెన్షన్ వేటు వేసి, విధుల్లో నుండి శాశ్వతంగా తొలగించాలి.
లేనిపక్షంలో, కార్పొరేట్ విద్య నియంత్రణ జె.ఏ.సి. ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు దిగుతామని హెచ్చరిస్తున్నాము. అక్రమాలకు సంబంధించిన పక్కా ఆధారాలు (వీడియో/ఆడియో సాక్ష్యాలు, ఫోర్జరీ పత్రాలు) అధికారులకు అందజేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. గత కొద్ది కాలంగా దీనిపై దోమలపల్లి గోపి, జన్నపాలా శ్రీశైలం, వంశీ, రవి, దినేష్ లు పోరాటం చేస్తున్నారు..
