- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి..
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను తప్పకుండా పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. బుధవారం మూడో దశ గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పెబ్బేరు, శ్రీరంగాపూర్, వీపనగండ్ల, చిన్నంబావి, పాన్ గల్ మండలాల్లో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఈ నేపథ్యంలో పెబ్బేరు మండలం కంచిరావుపల్లి, శ్రీరంగాపూర్ మండలం కంబలాపురం, శ్రీరంగాపురం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ స్వీకరణ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..

నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులకు కావలసిన దృవపత్రాలు అన్ని ఇచ్చారో లేదో సక్రమంగా చూసుకోవాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. సర్పంచ్, వార్డ్ మెంబర్ గా పోటీ చేయు అభ్యర్థికి ప్రతిపాదించి వ్యక్తి ఏ కులం వారైనా అయి ఉండొచ్చని అందులో సందేహం అవసరం లేదని అన్నారు. దాఖలైన నామినేషన్లకు సంబంధించి జిల్లా కేంద్రానికి సకాలంలో రిపోర్టులు పంపించాలని ఆదేశించారు. నామినేషన్ స్వీకరణ కేంద్రాలు ఫారం – 1 ప్రచూరణ చేస్తూ, నామినేషన్ స్వీకరణ కేంద్రాలో ఓటర్ జాబితాను ప్రదర్శించాలని తెలిపారు. ప్రతిరోజు నామినేషన్లను స్వీకరించిన అనంతరం సాయంత్రం అప్డేట్ చేయాలని అన్నారు. ఆయా మండలాల తహసిల్దార్లు, ఎంపీడీవోలు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

