ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) అంధుల క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధి బృందం బుధవారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(Chief Secretary-CS) కె.విజయానంద్‌ను కలిసింది. ఇటీవల అంధ మహిళల ప్రపంచ కప్(World Cup) గెలుచుకున్నఈ టీమ్ కెప్టెన్ దీపిక (Captain Deepika), సభ్యురాలు కరుణ కుమారి (Member Karuna Kumari) నేతృత్వంలో సీఎస్‌ను మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా అంధుల క్రికెట్ టీమ్(Blind Cricket Team)ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు.
ఆంధ్రప్రదేశ్ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో నిలబెట్టిన అంధులైన క్రికెటర్లకు ప్రభుత్వం నుంచి తగిన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. సీఎస్‌ను కలిసినవారిలో ఏపీ క్రికెట్ బ్లైండ్ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్న శరత్‌బాబు, కార్యదర్శి జి.రవీందర్, కోచ్ అండ్ ట్రెజరర్, అర్జున్ అవార్డు గ్రహీత అజయ్ కుమార్ రెడ్డి, టీ20 ప్రపంచ కప్ బ్లైండ్ క్రికెట్ ఇండియా కెప్టెన్ దీపిక టీసీ, టీ20 ప్రపంచ కప్ బ్లైండ్ క్రికెట్ స్టార్ ప్లేయర్ కరుణ కుమారి, టీం ఇండియా మేనేజర్ శికా శెట్టి, బోర్డు మేనేజర్ కె.కీర్తన, మెడికల్ హెడ్ డాక్టర్ జింకా లక్ష్మీ ప్రసన్న, లక్ష్మీ నారాయణ్ కుర్రా బెంగళూరు తదితరులు ఉన్నారు.

