పాత బస్తీ(Old City)లోని బమ్రుక్నుద్దౌలా సరస్సు 15 రోజుల్లో ప్రారంభం కానుంది. ఓల్డ్ సిటీలోని ఈ చారిత్రాత్మక సరస్సు వద్ద జరుగుతున్న తుది పనులను హైడ్రా కమిషనర్ (HYDRAA Commissioner) ఏవీ రంగనాథ్ (A.V.Ranganath) పరిశీలించారు. ఇది త్వరలో కొత్త పట్టణ మైలురాయి(New Urban Landmark)గా అవతరించనుందని చెప్పారు.
కట్ట బలోపేతం, అప్రోచ్ రోడ్లు, వాకింగ్ ట్రాక్‌లు, లైటింగ్, పార్కులు, ఆట స్థలాలు, ఓపెన్ జిమ్‌లు, సీటింగ్ జోన్‌లు, సిసిటివి పర్యవేక్షణను సమీక్షించారు. ఇస్లామిక్ నిర్మాణ శైలిలో ప్రవేశ ద్వారాలు, గెజిబోలను అభివృద్ధి చేయాలని, ఔషధ, నీడనిచ్చే చెట్ల పెంపకాన్ని ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. 1770లో నవాబ్ రుక్నుద్దౌలా నిర్మించిన ఈ సరస్సు ఆక్రమణలను తొలగించిన తర్వాత 4.12 ఎకరాల నుంచి 18 ఎకరాలకు పునరుద్ధరణ జరిగింది. స్థానికులు ఈ పనులను స్వాగతించారు.
