Saturday, May 2, 2026
Homeరంగారెడ్డిBondada Group | త్యాగధనులకు సలాం..

Bondada Group | త్యాగధనులకు సలాం..

  • సైనికులకు సత్కారం: బొండాడా గ్రూప్ ఆదర్శనీయం!

దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమించిన యోధులకు, తమ సర్వస్వాన్ని దేశానికి అర్పించిన అమరవీరుల కుటుంబాలకు అండగా నిలవాలనే గొప్ప సంకల్పంతో బొండాడా గ్రూప్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా, ‘ఏక్ ఇండియా మిషన్’ సహకారంతో 51 మంది సాయుధ దళాల అనుభవజ్ఞులు, వీరనారీలను ఘనంగా సత్కరించే కార్యక్రమాన్ని నిర్వహించింది.

గర్వించదగ్గ ఘట్టానికి వేదికైన సైనిక్‌పురి

హైదరాబాద్‌లోని సైనిక్‌పురిలో ఉన్న బ్రిగేడియర్ ఎం.కె. రావు మెమోరియల్ హాల్ శనివారం ఉదయం (నవంబర్ 29, 2025) ఓ భావోద్వేగభరితమైన, గర్వించదగ్గ ఘట్టానికి వేదికైంది. దేశ సేవలో తమ జీవితాలను అంకితం చేసిన వీరుల సేవలను స్మరించుకుంటూ, వారి కుటుంబాల త్యాగాలను గౌరవిస్తూ ఈ సత్కార కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. భారత సాయుధ దళాల కుటుంబాల అసాధారణ ధైర్యం, త్యాగం మరియు స్థైర్యాన్ని స్మరించుకోవడం, వారికి నిరంతరం మద్దతుగా నిలవడం మనందరి కర్తవ్యమని ఈ కార్యక్రమం మరోసారి గుర్తు చేసింది.

- Advertisement -

ప్రముఖుల సందడి.. యోధులకు వందనం

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ శ్రీ వి.సి. సజ్జనార్ (ఐపీఎస్) హాజరై, సాయుధ దళాల సేవలను కొనియాడారు. ఆయనతో పాటు ఉప్పల్ శాసనసభ్యులు శ్రీ బండారి లక్ష్మారెడ్డి, శ్రీ కె.ఎన్. కుమార్ ఐఏఎస్ (రిటైర్డ్), లెఫ్టినెంట్ జనరల్ కె.ఆర్. రావు (రిటైర్డ్), శ్రీ వి.వి. లక్ష్మీనారాయణ ఐపీఎస్ (రిటైర్డ్), రియర్ అడ్మిరల్ ఆర్. శ్రీనివాస్ VSM (రిటైర్డ్) – సీఈఓ, బొండాడా గ్రూప్, సీఏ బరతం సత్యనారాయణ, సీఎఫ్‌ఓ బొండాడా గ్రూప్ వంటి పలువురు ప్రముఖులు పాల్గొని, అనుభవజ్ఞులను, వీరనారీలను సత్కరించి తమ గౌరవాన్ని చాటుకున్నారు. సత్కారం అందుకున్న వారి కుటుంబ సభ్యులు, ఆహ్వానితులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News