Thursday, July 2, 2026
Homeఆజ్ కీ బాత్Aaj Ki Baath | కారాగారం కాదు… కర్మాగారం!

Aaj Ki Baath | కారాగారం కాదు… కర్మాగారం!

జైలు అంటే ఎందుకంత చులకన భావం? అది కేవలం చీకటి గది కాదు, ఒక నవజీవన సృజన క్షేత్రం! అది కేవలం కారాగారం కాదు.. మనిషిని సరిదిద్దే ఒక కర్మాగారం! ఇక్కడ ఉన్నోళ్లంతా నేరస్థులు కారు, నిందలు మోస్తూ, న్యాయం కోసం వేచి చూసే బాధితులూ.. రాజకీయ చదరంగంలో, ప్రజా పోరాటాల పథంలో… రెండు తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులే ఇదే జైలు జీవితాన్ని గడిపిన చరిత్ర ఉంది! స్వేచ్ఛ విలువ ఏమిటో తెలియాలంటే, నాలుగు గోడల మధ్యే ఆ పాఠం నేర్చుకోవాలి. జైలు అంటే స్వేచ్ఛను హరించడం కాదు.. నిజమైన స్వేచ్ఛ అంటే ఏమిటో నేర్పే గురుకులం! ఒకప్పటి ‘చిప్పకూడు’ ముచ్చట నిన్నటి మాట, నేడు చేతినిండా పనినిచ్చే ‘చేతివృత్తుల’ బాట! సన్నబియ్యం అన్నంతో కడుపు నింపుతూ.. నిన్ను ఒక ఉత్తమ పౌరుడిగా తీర్చిదిద్దే తరగతి గది ఈ జైలు.. మార్పు వైపు అడుగులు వేస్తూ, సరికొత్త సంస్కరణల దిశగా.. సగర్వంగా సాగుతోంది తెలంగాణ జైళ్ల శాఖ..

  • సుమన్ గౌడ్
- Advertisement -
RELATED ARTICLES

Latest News