మంచిర్యాల ఎమ్మెల్యే (Mancherial MLA) కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు(Kokkirala Premsagar Rao)ను టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ (MLC) బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ (Bomma Mahesh Kumar Goud) మర్యాదపూర్వకంగా (Respectfully) కలిశారు. హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ప్రేమ్‌సాగర్‌రావును మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఇటీవల అనారోగ్యానికి గురవటంతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొంది, డిశ్ఛార్జ్ అయి, ప్రస్తుతం తన ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్న ఆయన్ని పరామర్శించారు. ఆరోగ్య (Health) వివరాలను అడిగి తెలుసుకున్నారు.
- Advertisement -
