Homeమహబూబ్‌నగర్‌Selection | కార్యకర్తల ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక.

Selection | కార్యకర్తల ఏకాభిప్రాయంతోనే అభ్యర్థుల ఎంపిక.

  • పార్టీకి ద్రోహం చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
  • మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి..

కార్యకర్తల ఏకాభిప్రాయంతోని అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో సర్పంచ్ ఎన్నికల సన్నాహక సమావేశం, దీక్ష దివాస్ ఏర్పాట్ల గూర్చి సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మాజీమంత్రి పాల్గొనీ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకోవడానికి చీరల పంపిణీ చేస్తుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు నిచ్చారు. ప్రజలకు కె.సి.ఆర్ హయాములో జరిగిన అభివృద్ధి వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో విఫలమైన విషయాలను స్పష్టంగా వివరించాలని సూచించారు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలపట్ల పోరాటం చేస్తున్న నాయకులను అభ్యర్థులుగా ఎంపిక చేయాలని కార్యకర్తల అభిప్రాయం మేరకు అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని అన్నారు.

Niranjan Reddy on Candidate Selection.1

దీక్షా దివాస్ ఘనంగా నిర్వహించాలి.

కె.సి.ఆర్ ప్రాణాలు ఫణంగా పట్టి దీక్ష పూనుకున్న 29 నవంబర్ రోజు దీక్షా దివాస్ ఘనంగా నిర్వహించాలి అని తెలంగాణ రాక ముందు జరిగిన ఉద్యమం కె.సి.ఆర్ రాష్ట్రాన్ని సాధించిన విషయాలను ప్రజలకు,నవ యువకులకు తెలిపే విధంగా వేడుకలు ఉండాలని సూచించారు. దీక్షా దివాస్ స్పూర్తితో స్థానిక సమరానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డాక్టర్.బి.ఆర్ అంబేద్కర్ కి సమావేశంలో ఘనంగా నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమములో గట్టు యాదవ్,నాగం.తిరుపతి రెడ్డి, వాకిటి శ్రీధర్, కురుమూర్తి యాదవ్, నందిమల్ల అశోక్, పి రమేష్ గౌడ్, మాణిక్యం, వనం రాములు, వేణు యాదవ్, వెంకటస్వామి, బి బాలరాజు, రాళ్ల కృష్ణయ్య, మాజీ ప్రజా ప్రతినిధులు కృష్ణా నాయక్ రఘుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Niranjan Reddy on Candidate Selection.2
- Advertisement -
RELATED ARTICLES

Latest News