Thursday, March 12, 2026
HomeఫోటోలుMock Assembly | పిల్ల ఎమ్మెల్యేలు.. పిడుగుల్లాంటి పెర్ఫార్మెన్స్‌లు..

Mock Assembly | పిల్ల ఎమ్మెల్యేలు.. పిడుగుల్లాంటి పెర్ఫార్మెన్స్‌లు..

సంవిధాన్ దివస్ (Samvidhan Diwas) (రాజ్యాంగ దినోత్సవం-Constitution Day) సందర్భంగా ఏపీ అసెంబ్లీ ప్రాంగణం(AP Assembly premises)లో విద్యార్థులు (Students) నిర్వహించిన మాక్ అసెంబ్లీ ఆద్యంతం ఆకట్టుకుంది. ఎమ్మెల్యేలుగా పిల్లలు చూపిన ప్రతిభ ప్రతిఒక్కరినీ అలరించింది. ముఖ్యంగా వారి వేషధారణ అదుర్స్ అనిపించింది. సీఎం చంద్రబాబు (CM Chandra Babu), స్పీకర్, మంత్రులు, అధికారులు శెభాష్ అని మెచ్చుకున్నారు.

పాతిక ముప్పై ఏళ్ల వయసులో శాసనసభ్యులుగా గెలిచి అసెంబ్లీలో తొలిసారి మాట్లాడటానికే కొంచెం కంగారుపడే ఈ రోజుల్లో ఇంత చిన్న వయసులో ఎమ్మెల్యే పాత్రల్లో వారి అభినయం అందరి మన్ననలు పొందింది. సీఎం చంద్రబాబు ఏకంగా ఫ్లాష్‌బ్యాక్‌లో వెళ్లిపోయారు. తాను ఏ వయసులో ఎమ్మెల్యే అయ్యాను? ఎందుకయ్యాను? అనే విషయాలను ఈ సందర్భంగా పంచుకున్నారు. అంటే.. మాక్ అసెంబ్లీ ఆయన్ని అంతలా మెప్పించింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News