Homeఫోటోలు'Talcum Powder' | సినిమా గ్లింప్స్ రిలీజ్

‘Talcum Powder’ | సినిమా గ్లింప్స్ రిలీజ్

‘పెళ్లిచూపులు’, ‘మెంటల్ మదిలో’, ‘చూసి చూడంగానే’ వంటి వైవిధ్యమైన, కంటెంట్‌ బేస్డ్ చిత్రాలను నిర్మించిన నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడ్యూసర్ రాజ్ కందుకూరి మరో ఆసక్తికరమైన సినిమాతో రాబోతున్నారు. ఆయన ధర్మపథ క్రియేషన్స్ బ్యానర్‌పై శివ కందుకూరి హీరోగా ‘టాల్కమ్ పౌడర్’(Talcum Powder)అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సాయి నాథ్ పొన్నా రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ద్రిషికా చందర్ కథానాయికగా నటిస్తున్నారు. న్యూ ఏజ్ క్రైమ్ డ్రామెడీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రమోషన్స్‌ను తాజాగా ‘ది ఫస్ట్ స్ప్రింకిల్’ పేరుతో విడుదల చేసిన ఫస్ట్ గ్లింప్స్‌తో ప్రారంభించారు.

గ్లింప్స్‌లో బంటీ అనే డ్రగ్ పెడ్లర్ చుట్టూ కథను ఆసక్తికరంగా పరిచయం చేశారు. తెలియక చేసిన ఓ తప్పు కారణంగా బంటీ అనూహ్యమైన పరిస్థితుల్లో చిక్కుకుంటాడు. ఓవైపు పోలీసులు, మరోవైపు గ్యాంగ్‌స్టర్లు అతని కోసం వేట మొదలుపెట్టడంతో పరిస్థితులు మరింత గందరగోళంగా మారుతాయి. అసలు బంటీ చేసిన తప్పేంటి? ఈ చిక్కుల నుంచి అతను ఎలా బయటపడతాడు? అనే ప్రశ్నలను రేకెత్తిస్తూ.. సినిమా ప్రపంచంపై ఆసక్తిని పెంచేలా గ్లింప్స్ సాగింది.

- Advertisement -

క్రైమ్, కామెడీ, డ్రామాను కలిపి రేసీ నెరేషన్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రం అనూహ్యమైన మలుపులు, ఫన్‌తో కూడిన సన్నివేశాలతో అలరించబోతున్నట్లు గ్లింప్స్ చూస్తే తెలుస్తోంది. దర్శకుడు సాయినాథ్ పొన్నా అద్భుతమైన కథనంతో సినిమాకు ప్రత్యేకమైన టచ్ ఇచ్చారు. శివ కందుకూరి ఎనర్జిటిక్ స్క్రీన్ ప్రెజెన్స్ ఆకట్టుకోగా, వెంకటేష్ మహా, జీవన్ కుమార్ తదితరుల పాత్రలను కూడా గ్లింప్స్‌లో పరిచయం చేశారు.

టెక్నికల్‌గా కూడా సినిమా ఆకట్టుకుంది. సినిమాటోగ్రాఫర్ జీవీ అజయ్ కుమార్ స్టైలిష్ విజువల్స్ అందించగా, ఓషో వి తన సంగీతంతో కథకు మరింత ఎనర్జీని జోడించారు. సూర్య పొన్నపల్లి ఎడిటింగ్ రేసీగా వుంది.

డిఫరెంట్ కాన్సెప్ట్, క్విర్కీ క్యారెక్టర్స్, క్రైమ్-కామెడీతో వచ్చిన ‘ది ఫస్ట్ స్ప్రింకిల్’ ‘టాల్కమ్ పౌడర్’(Talcum Powder)పై ఆసక్తిని పెంచింది. ఈ న్యూ ఏజ్ క్రైమ్ డ్రామెడీ నవంబర్ 13న థియేటర్లలోకి రానుంది.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

తారాగణం: శివ కందుకూరి, దృషికా చందర్, వెంకటేష్ మహా,  జీవన్ కుమార్, కృష్ణ కమల్, రూపా లక్ష్మి, సంజయ్ స్వరూప్, యోగి ఖత్రి, నాగ మహేష్, శివాని మహి

సాంకేతిక సిబ్బంది:
రచన-దర్శకత్వం: సాయినాథ్ పొన్న
బ్యానర్: ధర్మపథ క్రియేషన్స్
నిర్మాత: రాజ్ కందుకూరి
DOP: జివి అజయ్ కుమార్
సంగీతం: ఓషో వి
ఎడిటర్: సూర్య పొన్నపల్లి
PRO: వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైన్స్: బ్లాక్-టికెట్

- Advertisement -
RELATED ARTICLES

Latest News