- విద్యార్థి నాయకుల పై పోలీసుల తీరును ఖండిస్తున్నాం
- ఎంసిపిఐ (యు) నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి
ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, కేవలం ఫీజుల దోపిడిని ధ్యేయంగా పెట్టుకున్న కొన్ని ప్రైవేటు విద్యాసంస్థలు తమ దోపిడీకి విద్యార్థి సంఘాల నేతలు అడ్డుగా ఉన్నారని ,ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు, పోలీసులతో మీలాఖత్ అయి అక్రమంగా అరెస్టు చేయడం ,విద్యార్థి నేతలపై చేయి చేసుకోవడం సరైన తీరు కాదని ఎంసిపిఐ (యు) నర్సంపేట డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి ఒక ప్రకటనలో తెలిపారు .ప్రైవేట్ విద్యాసంస్థల దోపిడి అరికట్టాలని, నిబంధనలు పాటించని విద్యాసంస్థల పై చర్యలు తీసుకోవాలని శాంతియుతంగా హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆఫీస్ కు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన వామపక్ష విద్యార్థి నాయకులను అడ్డుకొని అరెస్టులు చేయడం అప్రజాస్వామికం అన్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో దాదాపు వందలాది స్కూల్లు ఒకే బ్రాంచ్ తో రెండు మూడు స్కూల్స్ నడుపుతున్నారని వారి మీద చర్యలు తీసుకోవాలని విద్యాధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదన్నారు .ముడుపులు అందుకున్న ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోగా ,ప్రశ్నించిన విద్యార్థి నేతలపై దాడులు చేస్తూ తమ దోపిడిని మరింత తీవ్రతరం చేస్తున్నారన్నారు .ఈ తీరును ఎం సిపిఐ (యు) పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని భవిష్యత్తులో ఇలాంటి పరిణామాలకు చోటు లేకుండా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న ప్రైవేటు విద్యాసంస్థలపై నిగా పెట్టి చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో విద్యార్థి సంఘాలు చేసే ఉద్యమాలకు తమ పార్టీ అండగా నిలుస్తుంది అన్నారు.
