Thursday, February 12, 2026
Homeబిజినెస్Zomato | రెస్టారెంట్లకు కస్టమర్ల సమాచారం

Zomato | రెస్టారెంట్లకు కస్టమర్ల సమాచారం

ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్ జొమాటోపై రెస్టారెంట్ ఇండస్ట్రీ (Restaurant Industry) విజయం సాధించింది. కస్టమర్ల ఫోన్ నంబర్లను ఈటరీస్‌(Eateries)తో షేర్ చేసుకునేందుకు ఆ సంస్థ అంగీకరించింది. ఈ విషయమై జొమాటోకి, రెస్టారెంట్ ఇండస్ట్రీకి మధ్య ఇన్నాళ్లూ వైరం ఉండేది. అదిప్పుడు తెగిపోయినట్లు తెలుస్తోంది. దీనిపై జొమాటో స్పందించాల్సి ఉంది. వినియోగదారుల అనుమతితో వాళ్ల కాంటాక్ట్ నంబర్లను తమకు ఇచ్చేందుకు జొమాటో ఒప్పుకున్నట్లు నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (National Restaurant Association of India-NRAI) పేర్కొంది.

కస్టమర్ డేటా (Customer Data)ను ఇచ్చేందుకు ఇప్పటిదాక జొమాటో మరియు స్విగ్గీ (Swiggy) వెనకాడాయి. దీంతో ‘‘ఇది సరైన పద్ధతి కాదు’’ అంటూ ఈటరీస్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నాయి. కానీ.. ఈ పంచాయితీ తేలిపోవటంతో ఇక రెసార్టెంట్లకు కూడా వినియోగదారుల వివరాలు తెలుస్తాయి. తద్వారా వాళ్లకు మరింత సర్వీస్ అందించటానికి వీలుపడుతుంది. ఇష్యూస్ ఏమైనా ఉంటే క్లియర్ చేయటం తేలికవుతుంది. రెస్టారెంట్లు మరింత సమాచారాన్ని యూజర్లకు ఇవ్వొచ్చు. ఇన్నాళ్లూ కన్జ్యూమర్లే డైరెక్ట్‌గా రెస్టారెంట్లకు ఫోన్ చేయటానికి కుదిరేది. ఇప్పుడు రెస్టారెంట్లు కూడా తమ కస్టమర్లకు కాల్ చేయటానికి అవకాశం కలిగింది.

- Advertisement -

ఇప్పటిదాక వినియోగదారులు నేరుగా రెస్టారెంట్‌కి సర్వీస్ పొందితే తప్ప వాళ్ల వివరాలు లభించేవి కాదు. కానీ.. ఇప్పుడు ఆ సమస్య ఉండదు. పైగా తమకు ఏ ప్రాంతాల నుంచి ఎక్కువ ఆర్డర్లు వస్తున్నాయనే వివరాలు ఇకపై రెస్టారెంట్లకు లభిస్తాయి. ఇన్నాళ్లూ ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌(Onlie Food Delivery Plotform)లు ఈ డిటెయిల్స్ కూడా ఇచ్చేవి కాదు. ఫలానా విస్తీర్ణం నుంచి ఇన్ని ఆర్డర్లు వచ్చాయి అని మాత్రమే చెప్పేవి. దీనివల్ల రెస్టారెంట్లు ఆర్డర్లను ప్రిపేర్ చేయటానికి ఎక్కువ సమయం పట్టేది. ఇప్పుడు ఆ సమస్య కూడా పరిష్కారం అవుతుంది. రెస్టారెంట్లు తమ మార్కెటింగ్ ఖర్చులను తగ్గించుకునే వీలు కుదిరింది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News