జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే(JubileeHills Mla)గా గెలిచిన నవీన్ యాదవ్(Naveen Yadav).. శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి వారి మండల పూజ (Puja) మహోత్సవంలో పాల్గొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం శ్రీనగర్ కాలనీ(Srinagar Colony)లోని స్వామి వారి ఆలయంలో అయ్యప్ప స్వాములు (Swamulu) ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. గోశాలలో ఉన్న గోమాతలను పూజించారు. అనంతరం స్వామి వారి అన్నదాన (Bhiksha) కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నవీన్ యాదవ్ మాట్లాడుతూ.. అయ్యప్ప మాల ధరించిన స్వాములందరినీ ఆత్మీయంగా కలిసి దేవాలయ (Temple) అభివృద్ధి, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. స్వామి వారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలపైన ఎల్లవేళలా ఉండాలని మనస్పూర్తిగా కోరుకున్నారు. ఆలయ E.O శ్రీనివాస్ శర్మ, శ్రీను గురు స్వామి, దేవాలయ చైర్మన్ చీపిరి అర్జున్ యాదవ్, కమిటీ మెంబర్ దినేష్, దేవాలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వాములు, శ్రీనగర్ కాలనీవాసులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
