బంగ్లాదేశ్ మాజీ ప్రధాని (Former Bangladesh Prime Minister) షేక్ హసీనా(Sheikh Hasina)కు అంతర్జాతీయ నేరాల న్యాయస్థానం(International Crimes Tribunal-ICT) మరణశిక్ష (sentenced to death) విధించింది. ఆ దేశ అల్లర్ల కేసు(Riot Case)లో ఢాకా(Dhaka)లోని ఐసీటీ షేక్ హసీనాను దోషిగా తేల్చింది. మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేశారనే అభియోగాలపై వాదనలు విని ఈ తీర్పు ఇచ్చింది. 2024 జులై, ఆగస్టులో జరిగిన నిరసనల్లో 14 వందల మంది చనిపోయారని జడ్జి తెలిపారు. తనకు వ్యతిరేకంగా ఆందోళన చేసినవారిని చంపేయాలి షేక్ హసీనా ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. నిరసల్లో గాయపడ్డవారికి వైద్యం అందించేందుకు కూడా ఆమె నిరాకరించారని పేర్కొన్నారు. అధికారంలో ఉండేందుకు బలప్రయోగానికి దిగారని వెల్లడించింది.
- Advertisement -
