Thursday, March 5, 2026
HomeజాతీయంBihar | ఈ నెల 20న కొత్త ప్రభుత్వం!

Bihar | ఈ నెల 20న కొత్త ప్రభుత్వం!

ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి పదవి

బీహార్‌లో కొత్త ప్రభుత్వం (New Government) ఈ నెల 20న కొలువుదీరే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ముహూర్తం (Muhurat) ఫిక్స్ చేసినట్లు సమాచారం. సీఎం(CM)గా నితీష్ కుమారే (Nitish Kumar) కొనసాగుతారని తెలుస్తోంది. అయితే ప్రస్తుత శాసన సభ(Assembly)ను రద్దు చేసేందుకు కేబినెట్ (Cabinet) రేపు (సోమవారం) భేటీ కానుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ రద్దు తీర్మానానికి ఆమోదం తెలిపాక.. సీఎం తన రాజీనామాను గవర్నర్ (Governor) ఆరిఫ్ మహ్మద్ ఖాన్‌కు అందజేయనున్నారు. నూతన మంత్రివర్గంలో ప్రతి ఆరుగురు ఎమ్మెల్యేలకు ఒక మంత్రి అనే ఫార్మాలాను అమలుచేస్తారని అంటున్నారు. ఈ విషయమై కూటమి పక్షాల మధ్య చర్చలు జరుగుతున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES

Latest News