భారత రాజ్యాంగం(Constitution of India) అమల్లోకి వచ్చి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు (Andhra Pradesh High Court) అడ్వకేట్స్ అసోసియేషన్ (Advocates Association) ఆధ్వర్యంలో మంగళగిరి సీకే కన్వెన్షన్లో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్(Justice Bhushan Ramakrishna Gavai), ఏపీ చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్(AP Chief Justice Dheeraj Singh Thakur), సీఎం చంద్రబాబు(CM Chandrababu), పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అనంతరం సభికులను ఉద్దేశించి ప్రసంగించారు. ‘ఇండియా అండ్ ది లివింగ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ @ 75 ఇయర్స్’ అనే అంశంపై కీలకోపన్యాసం చేశారు.
ఈ సెమినార్లో ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్, గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయికళ్యాణ చక్రవర్తి, ఏపీ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు, సీనియర్ అడ్వకేట్ కె.చిదంబరం, జనరల్ సెక్రెటరీ సి.సుబోధ్, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, అదనపు అడ్వకేట్ జనరల్ ఇ.సాంబశివప్రతాప్, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ పొన్నారావు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎం.లక్ష్మీనారాయణ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పార్థసారధి, పలువురు ఇతర రిజిస్ట్రార్లు, సీనియర్ న్యాయవాదులు, గుంటూరు జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తదితరులు పాల్గొన్నారు.
