Tuesday, February 10, 2026
HomeతెలంగాణNaveen Yadav Victory | బీసీ రాజకీయాలకు మలుపు

Naveen Yadav Victory | బీసీ రాజకీయాలకు మలుపు

తెలంగాణలో బీసీల రాజకీయ ప్రభంజనం మొదలైంది
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
ఇక నుంచి గెలుపు గుర్రాలు బీసీలేనని వెల్లడి
బీసీలకు టికెట్ ఇవ్వనందుకే బీఆర్ఎస్ ఓటమి పాలైందని విమర్శ
బీసీ రిజర్వేషన్ల చట్టానికి బీజేపీ ఆమోదం తెలపకపోతే భవిష్యత్తులో జూబ్లీహిల్స్ ఫలితాలేనని హెచ్చరిక
బీసీలకు టికెట్ ఇచ్చినందుకే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిందని స్పష్టీకరణ
బీసీ రిజర్వేషన్లు పెంచకుండా అన్యాయం చేసినందుకు బీజేపీకి డిపాజిట్ గల్లంతైందని ఎద్దేవా

జూబ్లీహిల్స్ ఉపఎన్నిక(JubileeHills Bye Election)లో బీసీ (BC) సామాజిక వర్గానికి చెందిన నవీన్ యాదవ్ (Naveen Yadav) అఖండ మెజార్టీతో గెలవడం పట్ల బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ (Jajula Srinivas Goud) హర్షం వ్యక్తం చేశారు. ఇది బీసీల గెలుపుగా భావిస్తున్నామని చెప్పారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. నవీన్ యాదవ్ గెలవడం ద్వారా రాష్ట్రంలో బీసీల రాజకీయ ప్రభంజనం ప్రారంభమైందని, బీసీల రాజకీయాలకు మలుపు అని అభివర్ణించారు.

- Advertisement -

గతంలో బీసీలకు బీఫామ్‌లు (B-Forms) ఇస్తే ఓడిపోతారని, అగ్ర కులాలకు టికెట్లు ఇస్తే గెలుస్తారని, ప్రతి ఎన్నికల్లో గెలుపు గుర్రాలు అగ్ర కులాలే అంటూ అన్ని రాజకీయ పార్టీలు (Political Parties) పోటీపడి వారికి టికెట్లు ఇచ్చేవారని గుర్తుచేశారు. ఇక ఈరోజు నుంచి గెలుపు గుర్రాలు బీసీలేనని నవీన్ యాదవ్ గెలుపు ద్వారా రుజువైందని చెప్పారు. ఈ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల నుంచి పోటీ జరిగితే ఇద్దరు అగ్రకులాలతో పోరాడి ఒక బీసీ బిడ్డ విజయం సాధించడం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల రాజకీయ చైతన్యానికి నిదర్శనమని తెలిపారు.

బీసీ రిజర్వేషన్ల చట్టాన్ని ఆమోదించాలని మొరపెట్టుకున్నా వారి ఆకాంక్షలను గౌరవించని బీజేపీ(Bjp)కి ఎన్నికల్లో డిపాజిట్లు (Depostis) కూడా గల్లంతయాయని విమర్శించారు. బీసీకి టికెట్ కూడా ఇవ్వకుండా వారికి వ్యతిరేకంగా వ్యవహరించడం వల్ల బీజేపీకి బీసీలు ఈ ఎన్నికలను వేదికగా చేసుకొని బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. ఇక బీఆర్ఎస్ కూడా వారసత్వ రాజకీయాలకు పెద్దపీట వేస్తూ బీసీలకు టికెట్ ఇవ్వకుండా మరోసారి అగ్రకులాలకు టికెట్ ఇవ్వడం వల్ల గెలవాల్సిన సిట్టింగు సీటు ఓడిపోయిందని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ అభ్యర్థికి ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం మూలంగానే గెలిచిందని, గత ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా బీసీలకు ఇవ్వకుండా అగ్రకులానికి చెందిన నరేందర్ రెడ్డికి ఇవ్వడం మూలంగా ఓడిపోయిందని గుర్తు చేశారు. ఏదిఏమైనప్పటికీ జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకొని ఇకనైనా మెజార్టీ ప్రజలైన బీసీలకు, ఇక నుంచి జరిగే ఏ ఎన్నికైనా అన్ని రాజకీయ పార్టీలు బీసీలకే టికెట్లు ఇవ్వాలని, లేకుంటే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పట్టిన గతే బీసీ వ్యతిరేక పార్టీలకు పడుతుందని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన నవీన్ యాదవ్‌కు, బీసీ బిడ్డకు అండగా నిలిచిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, అగ్రకుల పేదలకు జాజుల శ్రీనివాస్ గౌడ్ ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News