Wednesday, March 4, 2026
Homeహైదరాబాద్‌RTC | డిస్మిస్ అయినవారికి ఉద్యోగాలివ్వాలి

RTC | డిస్మిస్ అయినవారికి ఉద్యోగాలివ్వాలి

ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డికి కవిత వినతిపత్రం

2021 నుంచి ఇప్పటి వరకు చిన్న చిన్న కారణాలతో డిస్మిస్ (Dismiss) అయిన డ్రైవర్లు(Drivers), కండక్టర్లు (Conductors), ఇతర కార్మికులు (Workers) 1,300 మందికి తిరిగి ఉద్యోగాలివ్వాలని తెలంగాణ జాగృతి (Telangana Jagruti) అధ్యక్షురాలు (President) కవిత కోరారు. హైదరాబాద్‌లోని బస్ భవన్‌(Bus Bhavan)లో ఆర్టీసీ ఎండీ (Rtc MD) నాగిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తొలగింపునకు గురైనవారిలో 491 మందిని తిరిగి విధుల్లోకి తీసుకుంటామని గతంలోనే ఉత్తర్వులు ఇచ్చారని చెప్పారు. అయితే.. వాళ్లను కూడా ఉద్యోగాల్లోకి తీసుకునే ఆలోచన సంస్థకు లేనట్టుందని, ఎండీని కలిసిన తర్వాత ఆ విషయం అర్థమైందని తెలిపారు. ఆ 491 మంది కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మిగతా కార్మికుల విషయంలోనూ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.

ఆమె ఇంకా ఏమన్నారంటే..

ఆర్టీసీలో హైర్ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుంటున్నారు. వాటి డ్రైవర్లపై ఆర్టీసీకి నియంత్రణ ఉండటంలేదు. హైర్, ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ డ్రైవర్లే నడిపించేలా చర్యలు తీసుకోవాలి. ఆర్టీసీ డ్రైవర్లు శిక్షణ పొందినవాళ్లు. ప్రైవేట్ డ్రైవర్ల వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు?. ఆర్టీసీ కార్మికులకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి. అప్పుడే.. భద్రమైన ప్రయాణం ప్రజలకు, ఉద్యోగ భద్రత కార్మికులకు ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News