Wednesday, February 11, 2026
Homeఅంతర్జాతీయంBangladesh | మళ్లీ హింసాత్మక ఘటనలు

Bangladesh | మళ్లీ హింసాత్మక ఘటనలు

బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాత్మక ఘటనలు (Violent incidents) చెలరేగాయి. మాజీ ప్రధాని షేక్ హసీనా(Former Prime Minister Sheikh Hasina)పై నమోదైన కేసుల్లో కోర్టు తీర్పు(Judgment) ఈ నెల 17న రానుంది. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాల్లో దాడులు (Attacks) చోటుచేసుకున్నాయి. దీంతో యూనస్ ప్రభుత్వం (Yunus Government) రాజధాని ఢాకా(Dhaka)లో సెక్యూరిటీ (Security) పెంచింది. ప్రధానంగా.. ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్‌(ICT)ను భద్రతావలయంలో బంధించారు. హసీనా పార్టీ అవామీ లీగ్ రాజధాని నగరంలో లాక్‌డౌన్‌(Lock Down) పాటించాలని ప్రజలను కోరింది. దీనివల్ల పోలీసులను, బోర్డర్ గార్డ్ సెక్యూరిటీని పెద్ద సంఖ్యలో రంగంలోకి దింపారు. ఢాకాలోకి వెళ్లే రూట్లలో చాలా చోట్ల చెక్ పాయింట్లను ఏర్పాటుచేశారు. అడుగడుగునా తనిఖీలు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News