- తెలంగాణ రాజకీయాల్లో మసకబారుతున్న గులాబీ పార్టీ
- జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కేసీఆర్ గైర్హాజరు..
- కేటీఆర్, హరీష్ రావు మధ్య మౌనం.. లోపిస్తున్న సమన్వయం
- ప్రజల పార్టీనా? లేక కుటుంబ పార్టీనా?” అంటూ ప్రజల్లో చర్చ
తెలంగాణ రాజకీయాలలో ఒకప్పుడు పింక్ జెండా గర్వంగా ఎగిరింది. ఆ జెండా వెనుక ఉన్న ఏకైక శక్తి… కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆయన మాటే చట్టం, ఆయన చూపే దిశే పాలన, కానీ ఇప్పుడు అదే పింక్ జెండా గాలిలో ఎగురుతున్నా, దానికున్న దిక్సూచి మాత్రం మసకబారినట్లుంది. బీఆర్ఎస్ లోపల నిశ్శబ్దం పెరిగింది, కానీ ఆ నిశ్శబ్దం ఆందోళన కలిగించేలా మారిందనే అభిప్రాయలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఒక నిశ్శబ్ధపూరిత వాతావరణం నెలకొని ఉంది. కానీ మార్పు మాత్రం ఖచ్చితం గా జరుగుతోంది. ఒకప్పుడు సర్వాధికారిగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు తన అంతర్గత సమస్యలతో పోరాడుతోందనే అభిప్రాయలు వినపడుతున్నాయి పది సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత పార్టీ శక్తి క్రమంగా తగ్గిపోతోంది.
ఈ పరిణామాలు కేవలం ఎన్నికల ఫలితాలకే సంబంధించినవి కావు.. ఇవి రానున్న కాలంలో చోటు చేసుకోబోతున్న ఒక పెద్ద రాజకీయ పరిణామానికి సూచనలు. అధికారం కోల్పోయాక కేసీఆర్ ప్రజల మధ్య కనిపించకపోవడం, జూబ్లిహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో కూడా పాల్గొనకపోవడం పార్టీ భవిష్యత్తుపై అనేక సందేహాలు రేకెత్తిస్తోంది. ఒకప్పుడు ఆయన హాజరు అంటే కేడర్ లో ఉత్సాహం, ప్రజల్లో నమ్మకం, కానీ ఇప్పుడు ఆయన గైర్హాజరు కేడర్లో అనేక రకాల గందరగోళ పరిస్థితులకు దారితీస్తూ, ప్రజల్లో నిరాశను పెంచుతోంది అని విశ్లేషకుల టాక్. ఇది కేవలం ప్రచార వ్యూహ లోపం మాత్రమే కాదు, పార్టీ అధినాయకత్వం ప్రజలకు దూరమవుతోందనే సంకేతం.
కేటీఆర్, హరీష్ రావు మధ్య మౌనం పార్టీకి కొత్త పరిమితులకు అర్థం చెబుతోంది. పెరుగుతున్న అంతరాలకు సన్నని గీతను గీస్తోంది . ఎవరు ఎవరి వైపు నిలబడాలో కేడర్్క తెలియని గందరగోళం నెలకొంది. ఇక కవితపై వచ్చిన కేసులు, కుటుంబ రాజకీయాలనే ముద్ర, పార్టీని కుటుంబం కంట్రోల్ చేసే సంస్థ”గా మాత్రమే చూపుతున్నాయి. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ అడుగులు ఆగిపోయాయి. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా మారినపుడు దేశాన్ని ఆకట్టుకోవాలన్న కల.. మొదటి మెట్టులోనే జారిపోయింది. తెలంగాణలో కూడా రైతులు, నిరుద్యోగులు, దళితులు ఎదురుచూస్తున్న హామీలు నెరవేరకపోవడం ప్రజల్లో నిరుత్సాహాన్ని పెంచింది.
“బీఆర్ఎస్ ప్రజల పార్టీనా? లేక కుటుంబ పార్టీనా?” అనే ప్రశ్న ఇప్పుడు ప్రతి చర్చలో వినిపిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయాక కేసీఆర్ మౌనం ఇప్పుడు ఒక పెద్ద సందేహాస్పద సంకేతం, ఆయన మళ్లీ ప్రజల మధ్యకు వచ్చి కొత్త దిశ చూపిస్తారా? లేక కొత్త తరంలోని నాయకులు (కేటీఆర్, హరీష్ రావు) పార్టీ దిశను మార్చనున్నారా ? ఇలా పార్టీ లోపల ఉన్న రెండు కాపాడాలనుకునేవర్గం, కొత్త మార్పు కోరుకునేవర్గం ఒకదానిని శక్తులు, అంటే పాత వ్యవస్థను ఒకటి డీ కొని మీమాంసకు కారణమవుతున్నాయా? మొత్తం మీద చేయెప్పుకోవాలంటే తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఒక కీలక మలుపులో ఉన్నాయి. జూబ్లిహిల్స్ ప్రచారంలో కేసీఆర్ గైర్హాజరు, నేతల మధ్య సమన్వయ లోపం, ప్రజల్లో మారుతున్న అభిప్రాయాలు..
ఇవన్నీ దేనికి సంకేతం? బీఆర్ఎస్ ముందుంది ఇప్పుడు ఒకే ఒక ఒక ప్రశ్న.. “ప్రజలతో మళ్లీ కలుస్తుందా? లేక తాను నిర్మించిన ప్రగతి భవన్ గోడలలో తానే బంధించబడిపోతుందా?” ఈ సమాధానం మాత్రం త్వరలోనే తెలుస్తుంది, కానీ ఒక విషయం మాత్రం క్లియర్.. తెలంగాణలో రాజకీయ శకటం మళ్లీ సరికొత్త కొత్త దిశలో పయనించబోతోంది. మొత్తానికి తెలంగాణ రాజకీయాలు ఇప్పుడు ఒక చరిత్రాత్మక మలుపులో నిలిచాయి. ఒకప్పుడు పింక్ జెండా గర్వంగా ఎగిరిన ఈ నేలపై, ఇప్పుడు రాజకీయ గాలులు కొత్త దిశలో వీచుతున్నాయి. ప్రజలు మళ్లీ బీఆర్ఎస్పై నమ్మకం ఉంచుతారా? లేక మార్పు కోసం కొత్త రాజకీయ శక్తికి అవకాశం ఇస్తారా? మౌనంగా ఉన్న కేసీఆర్ మళ్లీ ప్రజల మధ్యకు వచ్చి దిశ చూపుతారా, లేక కొత్త తరం నాయకత్వానికి బాధ్యత అప్పగిస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం రానున్న కాలం లో. ప్రజలే నిర్ణయిస్తారు.
