Homeస్పోర్ట్స్CM Chandrababu | చంద్రబాబును కలిసిన శ్రీచరణి, మిథాలీరాజ్

CM Chandrababu | చంద్రబాబును కలిసిన శ్రీచరణి, మిథాలీరాజ్

ఇండియన్ ఉమెన్ క్రికెటర్ (India Women Cricketer) శ్రీచరణి(SriCharani), మాజీ కెప్టెన్ మిథాలి రాజ్(Mithaliraj) శుక్రవారం అమరావతి(Amaravathi)లోని సీఎం క్యాంప్ ఆఫీసు(CM Camp Office)కు వచ్చి చంద్రబాబును కలిశారు. వారిద్దరికి మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) స్వాగతం పలికారు. ఉమెన్ క్రికెట్ వరల్డ్ కప్‌ (Women World Cup)ను గెలుచుకున్నందుకు శ్రీచరణిని సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ అభినందించారు.

578250652 1420942912725165 4353427989661638375 n

వరల్డ్ కప్ గెలుచుకున్న ఆనంద క్షణాలను శ్రీచరణి.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌తో పంచుకున్నారు. ఉమెన్ వరల్డ్ కప్ గెలుచుకోవడం ద్వారా భారత మహిళల సత్తా చాటారని, మహిళా క్రీడాకారులకు ఆదర్శంగా నిలిచారని సీఎం చంద్రబాబు మెచ్చుకున్నారు.

- Advertisement -
578260809 1420943056058484 1585129015836078391 n

గన్నవరం ఎయిర్ పోర్టులో శ్రీచరణికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేశినేని చిన్ని, కార్యదర్శి సానా సతీష్, మంత్రులు అనిత, సవిత, సంధ్యారాణి, శాప్ ఛైర్మన్ అనిమిని రవినాయుడు ఘన స్వాగతం పలికారు. ఎంపీలు, మంత్రులు, శాప్ ఛైర్మన్.. శ్రీచరణిని, మిథాలీ రాజ్‌ను వెంట పెట్టుకొని సీఎం క్యాంప్ ఆఫీసుకు వచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News