HomeసినిమాThalaivar 173 | కమల్‌హాసన్ సమర్పణలో రజినీకాంత్ సినిమా

Thalaivar 173 | కమల్‌హాసన్ సమర్పణలో రజినీకాంత్ సినిమా

కమల్‌హాసన్(Kamal Haassn) సమర్పణలో రజినీకాంత్(rajinikanth) ఓ సినిమా (Thalaivar 173) చేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. ఈ మూవీ 2027లో సంక్రాంతికి విడుదల కానుంది. సూపర్‌స్టార్ రజినీకాంత్ హీరోగా కమల్‌హాసన్ నిర్మాణ సంస్థ రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై దేశ సినిమా రంగంలో మైలురాయిగా నిలిచే మహత్తర ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి సుందర్ సి (Sunder C) దర్శకత్వం వహిస్తున్నారు. ఇది.. ఇద్దరు మహానటుల మధ్య 5 దశాబ్దాల స్నేహం, సహోదర బంధాన్ని సెలబ్రేట్ చేసుకునే బిగ్ సినిమాటిక్ ఈవెంట్.

IMG 20251105 WA0109

రజినీకాంత్, కమల్ హాసన్‌ అనుబంధం తరతరాల కళాకారులకు, ప్రేక్షకులకు స్ఫూర్తినిస్తుంది. రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ 44 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకొని రూపొందుతున్న Thalaivar 173.. సూపర్‌స్టార్ రజినీకాంత్ మ్యాగ్నెటిక్ స్క్రీన్ పవర్, సుందర్ సి డైరెక్షన్‌ కలిపి ప్రేక్షకులకు విశేషమైన అనుభూతిని అందించబోతుంది. కమల్‌హాసన్, ఆర్. మహేంద్రన్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం రెడ్ జెయింట్ మూవీస్ ద్వారా 2027 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News