Thursday, February 12, 2026
Homeక్రైమ్ వార్తలుRagging | నల్గొండ మెడికల్ కాలేజీ ర్యాగింగ్ కలకలం..

Ragging | నల్గొండ మెడికల్ కాలేజీ ర్యాగింగ్ కలకలం..

నల్గొండ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మరోసారి ర్యాగింగ్ కలకలం చోటుచేసుకుంది. ఫస్టియర్ విద్యార్థులపై సెకండియర్ విద్యార్థులు హాస్టల్‌లో ర్యాగింగ్‌కు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత నెల 31వ తేదీన రాత్రి హాస్టల్ భవనంలో కొంతమంది సీనియర్లు జూనియర్లను పిలిచి అవమానకరంగా ప్రవర్తించినట్లు సమాచారం. ఈ విషయం బాధిత విద్యార్థులు వెంటనే కాలేజీ ప్రిన్సిపాల్, హాస్టల్ వార్డెన్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, పెద్దగా పట్టించుకోలేదని తెలుస్తోంది.

ఇదే ధైర్యంతో సెకండియర్ విద్యార్థులు నవంబరు 4న మళ్లీ ర్యాగింగ్‌కు పాల్పడి జూనియర్లను బెదిరించినట్లు తెలుస్తోంది.విద్యార్థుల ఫిర్యాదుతో ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ర్యాగింగ్‌పై కాలేజీ యాజమాన్యం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కాలేజీలో ఆందోళన నెలకొంది. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశాలు జారీ చేశారు.గత ఏడాది కూడా ఇదే కళాశాలలో ర్యాగింగ్ ఘటన చోటుచేసుకుని ముగ్గురు విద్యార్థులు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. అయినా కూడా ర్యాగింగ్ ఘటనలు ఆగకపోవడం విద్యార్థుల్లో భయాందోళనకు కారణమైంది

- Advertisement -
RELATED ARTICLES

Latest News