Friday, September 20, 2024
spot_img

40 ఏళ్ల నుంచి నిరీక్షిస్తున్న.. ఒకే పార్టీ.. ఒకే సిద్దాంతం

తప్పక చదవండి
  • ఒక్క అవకాశం ఇవ్వండి.. అభివృద్ధి చేస్తా
  • మీ బిడ్డల భవిష్యత్తును తాకట్టు పెట్టకండి
  • నమ్మినవాళ్ళని మోసం చేస్తే, ఎప్పుడో ఎమ్మెల్యేని అయ్యేవాడిని
  • బడుగు బలహీన వర్గాల ప్రజలారా మీ బీసీ బిడ్డకు రాజ్యాధికారం ఇవ్వండి
  • కల్వకుర్తిలో కమల వికాసం కోసం తల్లోజు ఆచారి

హైదరాబాద్ : కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలు చైతన్యవంతులని ఆ చైతన్యాన్ని ఒక బీసీ బిడ్డని గెలిపించుకోవడానికి చూపెట్టాలని డబ్బు కోసం మీ బిడ్డల జీవితాలను తాకట్టు పెట్టొద్దని నియోజకవర్గ నుండి ఎమ్మెల్యేగా బరిలో నిలిచిన తల్లోజు ఆచారి అన్నారు. ఎన్నో ఏళ్ల నుండి బిజెపి పార్టీలో ఉంటూ నమ్మిన సిద్ధాంతాల కోసం పనిచేస్తున్న నాలాంటి నాయకుడు కల్వకుర్తి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయితే నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతానని అన్నారు. కష్టమైనా నష్టమైన ప్రజల కోసం ఇన్నేళ్లుగా పనిచేస్తున్నానని ఇప్పటికైనా మీ బిడ్డను గెలిపించాలని కోరుతున్నారు.

నమ్ముకున్న వాళ్ళని మోసం చేయాలనుకుంటే ఎప్పుడో ఎమ్మెల్యేని అయ్యవాణ్ణి

- Advertisement -

నేను ఒక పార్టీ సిద్ధాంతాల కోసం కట్టుబడి ఉన్నానని నమ్ముకున్న వాళ్లను మోసం చేయొద్దని దృఢ సంకల్పంతో ప్రజల కోసం పనిచేస్తున్నానని ఒకవేళ నేను నా సిద్ధాంతాలను పక్కన పెడితే మోసం చేయాలని అనుకుంటే ఎప్పుడు కల్వకుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యేని మంత్రిని అయ్యేవాడిని కానీ నేను ప్రజల మనిషిని కాబట్టి బడుగు బలహీన వర్గాల అభివృద్ధిని ఆకాంక్షించే వాడిని అందుకే నేను పార్టీలు మారలేదు నాకు ఎంతోమంది ఎన్నో రకాలుగా అవకాశాలు ఇస్తామన్న నా నియోజకవర్గ ప్రజల కోసం నా సిద్ధాంతాలను నా మనస్సాక్షిని తాకట్టు పెట్టే వ్యక్తిని కానని అన్నారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలని మీ కన్న కొడుకు లాంటి నన్ను ఆదరించి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మీకు సేవ చేసుకుంటానని ఒక్కసారి అవకాశం కల్పించండి అంటూ గ్రామ గ్రామాన తిరుగుతూ ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించిందంటూ కోరుతున్నాడు.

40 ఏళ్ల నుంచి నిరీక్షిస్తున్నాను ఒకసారి అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తాను

ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి నియోజకవర్గ ఎలా అభివృద్ధి అవుతుందో అంటూ ఆయన ప్రజలను వేడుకుంటున్నాడు అధికారంలో లేకున్నా కూడా ఎంతోమందికి సేవలు చేస్తూ వారి కష్టనష్టాల్లో పాలుపంచుకుంటూ సహకార అందిస్తున్నాడు అదే అధికారం ఉంటే ఇంకా సేవ చేసే భాగ్యం ఎక్కువగా ఉంటుందని ఆయన ప్రజలకు వివరిస్తున్నాడు. ఏదేమైనా కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలు కమలాన్ని వికసింప చేయాలన్న సంకల్పంతో ఉన్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు ప్రజల ఆశీర్వాదం ముందు డబ్బు పని చేయదని కల్వకుర్తి ప్రజలు డబ్బుకు అమ్ముడుపోయి వ్యక్తులు కారని ఈసారి ఎలాగైనా నియోజకవర్గంలో కమలాన్ని వికసింప చేసుకుంటారని ఆ నమ్మకం ప్రజల పట్ల నాకు ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు.

నియోజకవర్గంలో మార్పు తీసుకురావాలి

బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తానన్నా బిజెపి పార్టీకి ఓటు వేయాలని నియోజకవర్గం లో మార్పు జరగాలని ఆయన అన్నారు కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలకు ఓటు వేస్తే మళ్లీ దొరల రాజ్యం లేదా రెడ్డిల రాజ్యం వస్తుందని ఆయన ప్రచారంలో భాగంగా అన్నారు. మళ్లీ తిరిగి తిరిగి దొరల కాళ్ల దగ్గరికి చేరుదామా అంటూ ఆయన ఓటర్లను ఉత్తేజపరుస్తున్నారు యువత మహిళలు ఒకసారి ఆలోచించాలని అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు ప్రతి ఒక్కరూ ఆలోచన చేసి బిజెపి పార్టీకి ఓటు వేసి తెలంగాణ రాష్ట్రంలో బిసి ముఖ్యమంత్రిని చేసుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కల్వకుర్తి నియోజకవర్గంలో కమలం వికసించేది కాయం. ప్రజలారా ఒక్కసారి ఆలోచించండి మార్పు మొదలవ్వాలి మార్పుకు కనుక భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి బీసీ ముఖ్యమంత్రి కోసం మద్దతు తెలిపాలని అన్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజలారా మీ బీసీ బిడ్డకు రాజ్యాధికారం ఇవ్వాలంటూ కోరారు. ఒక్కసారి అవకాశం ఇచ్చి ఆచారిని గెలిపించుకుంటే నియోజకవర్గంలో అభివృద్ధితోపాటు యువతకు ఉద్యోగాలు విద్యార్థులకు ఎన్నో సదుపాయాలు రైతులకు రైతు భరోసా వరికి క్వింటాలుకు 3000 ఒక 100 మద్దతు ధర నిరుపేదలకు సంవత్సరానికి నాలుగు గ్యాస్ సిలిండర్లు ఉచితం నవజాత శిశువులకు నగదు డిపాజిట్లు డిగ్రీ విద్యార్థులకు లాప్టాప్ లు గల్ఫ్ బాదలకు నోడల్ ఏజెన్సీ తద్వారా చేయూత ఎస్సీ వర్గీకరణ ఉచిత విద్య వైద్యం లాంటి ఎన్నో అద్భుతమైన పథకాలు ఎన్ని ఉన్నాయి. వీటన్నింటిని అనుభవించాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు