సికింద్రాబాద్ మహేంద్రా హిల్స్‌లోని శ్రీ జగన్నాథ మందిరం & గౌశాల(Sri Jagannath Temple & Gaushala)లో పవిత్ర తులసీ మాత వివాహ మహోత్సవం (Tulsi Mata’s wedding celebration) భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగింది. శ్రీ తులసీ దేవిని పట్టు చీర, గాజులు, బిందీ, సింధూరం, పూల హారాలతో అద్భుతంగా అలంకరించారు. ఆలయం మొత్తం హరినామ సంకీర్తనలతో, భక్తుల హర్షధ్వానాలతో మారుమోగింది. ఈ కార్యక్రమం ఆదివారం సాయంత్రం 5 గంటలకు హరినామ సంకీర్తనతో ప్రారంభమైంది. భోగ హారతి, సంధ్యా హారతి, చివరికి తులసి వివాహం నిర్వహించారు. అనంతరం దామోదరాష్టకం (Damodarashtakam) పఠించి భక్తులకు మహా ప్రసాదం (Mahaa Prasadam) పంపిణీ చేశారు. ఈ పవిత్ర వేడుకలో సుమారు 200 మంది భక్తులు పాల్గొని తులసీ దేవి, శ్రీమహావిష్ణువు (Lord Vishnu) ఆశీస్సులు పొందారు. హైదరాబాద్ నగరంలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిరంతరం నిర్వహించే ప్రత్యేక ఆలయంగా శ్రీ జగన్నాథ మందిరం గుర్తింపు పొందింది.
Secunderabad | ఘనంగా తులసీ మాత వివాహం
- Advertisement -
RELATED ARTICLES
