Homeహైదరాబాద్‌Naveen Yadav | నవీన్ యాదవ్‌ గెలుపు లాంఛనమే

Naveen Yadav | నవీన్ యాదవ్‌ గెలుపు లాంఛనమే

షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

యూసఫ్‌గూడ డివిజన్ కృష్ణానగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం

- Advertisement -

స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హాజరు

జూబ్లీహిల్స్ నియోజకవర్గం(JubileeHills)లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి (Congress Party Candidate) నవీన్ యాదవ్ (Naveen Yadav) గెలుపు కోసం కట్టుదిట్టమైన ప్రణాళిక చేపట్టాలని షాద్‌నగర్ (Shad Nagar) ఎమ్మెల్యే(Mla), రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ (Veerlapalli Shankar) అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని యూసుఫ్‌గూడ డివిజన్ కృష్ణా నగర్ కాంగ్రెస్ పార్టీ ఉపఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్న ఆయన ఈ మేరకు సమావేశం నిర్వహించారు. కృష్ణా నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ మీటింగ్‌లో మిర్యాలగూడ ఎమ్మెల్యే (Miryalaguda Mla) లక్ష్మారెడ్డి, స్పోర్ట్స్ అథారిటీ (Sports Authority) రాష్ట్ర చైర్మన్ శివసేనారెడ్డి తదితర పార్టీ ముఖ్య శ్రేణులు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా డివిజన్ పరిధిలో అనుసరించాల్సిన ఎన్నికల వ్యూహాన్ని, బూత్‌ల వారీగా చేపట్టాల్సిన బాధ్యతలను తెలియజేశారు.

WhatsApp Image 2025 11 02 at 21.05.30 1

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల గెలుపుతో కాంగ్రెస్ కు మరింత జోష్ తీసుకురావాలని కార్యకర్తలకు సూచించారు. నవీన్ యాదవ్ గెలుపు ఖాయం అయ్యిందని, గెలుపు లాంఛనమేనని తెలిపారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త సమన్వయంతో పని చేయాలని సూచించారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల సందర్బంగా బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలతో సమీక్షా సమావేశం నిర్వహించి నవీన్ యాదవ్ గెలుపుకు సంబంధించి వ్యూహప్రతివ్యూహాలను రచించారు. నవంబర్ 11న జరగబోయే జూబ్లీహిల్స్ బైఎలక్షన్స్ లో చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలందరు సమన్వయంతో పని చేయాలని కోరారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా డివిజన్ పరిధిలో ఎక్కడికి వెళ్లినా మంచి స్పందన లభిస్తోందని ఎమ్మెల్యే శంకర్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News