Friday, June 19, 2026
HomeసినిమాNN5 | మూవీ హ్యూమరస్ పోస్టర్ ద్వారా అనౌన్స్‌మెంట్

NN5 | మూవీ హ్యూమరస్ పోస్టర్ ద్వారా అనౌన్స్‌మెంట్

రైజింగ్ యంగ్ స్టార్ నార్నే నితిన్ ‘మ్యాడ్’, ‘ఆయ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ వంటి వరుస విజయాల తర్వాత తన కెరీర్‌లో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు. ‘జూనియర్’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన రాధా కృష్ణతో సరికొత్త రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ కోసం జతకట్టారు. #NN5 చిత్రాన్ని ప్రతిష్టాత్మక కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్నారు.

పలు చిత్ర పరిశ్రమలలోని ప్రముఖ తారలతో భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్లను నిర్మించడంలో పేరుగాంచిన కేవీఎన్ ప్రొడక్షన్స్, ప్రస్తుతం దర్శకుడు బాబీ కొల్లితో మెగాస్టార్ చిరంజీవి చేయబోయే చిత్రంతో సహా అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను నిర్మిస్తోంది. ఈ బ్యానర్ #NN5 చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించడానికి సిద్ధమవుతోంది.

- Advertisement -

నార్నే నితిన్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన అనౌన్స్‌మెంట్ పోస్టర్ వినూత్నంగా ఆకట్టుకుంటోంది. ఇన్‌స్టాగ్రామ్ పోస్టు తరహాలో డిజైన్ చేసిన ఈ పోస్టర్ యూత్‌ఫుల్ రొమాంటిక్ వైబ్‌ను అందిస్తోంది. నీలాకాశం నేపథ్యంగా ఓ భవనం అంచున టీ-షర్ట్, జీన్స్, స్నీకర్స్‌లో కూల్‌గా కూర్చున్న నార్నే నితిన్ కనిపిస్తుండగా, ఎరుపు రంగు డ్రెస్‌లో ఉన్న ఓ యువతి పోస్టులోని హార్ట్ ఐకాన్‌ను ట్యాప్ చేయబోతున్నట్లు చూపించారు.

“ఆకాశంలో ఉంటుంది మూన్… నువ్వే నా లైఫ్‌కి క్వీన్…” అనే ఫన్నీ లైన్‌తో పాటు వేలాది లైక్స్, కామెంట్స్, ట్రెండీ హ్యాష్‌ట్యాగ్స్ పోస్టర్‌కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాకుండా నార్నే నితిన్ బావ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పోస్టును లైక్ చేసినట్లు చూపించడం అభిమానులను మరింత ఆకట్టుకుంటోంది. పోస్టర్ ద్వారా చిత్రంలోని రొమాన్స్, వినోదం మాత్రమే కాకుండా మేకర్స్ క్రియేటివ్ ఆలోచన కూడా స్పష్టమవుతోంది.

ప్రేమ, హాస్యం, భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందనున్న ఈ చిత్రం ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించబోతోంది.

ఈ చిత్రానికి రామ మారుతి ఎం సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, నిరంజన్ దేవరమానే ఎడిటింగ్ నిర్వహిస్తున్నారు. శివ కామేశ్ డి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. శరణ్య పొట్ల, అజయ్ గద్దె ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్‌గా వ్యవహరిస్తున్నారు.

మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.

తారాగణం: నార్నే నితిన్

సాంకేతిక సిబ్బంది:
ప్రొడక్షన్: KVN ప్రొడక్షన్స్
నిర్మాత: వెంకట్ కె నారాయణ
దర్శకత్వం: రాధా కృష్ణ రెడ్డి
డీవోపీ: రామ మారుతి M
ఎడిటర్: నిరంజన్ దేవరమానె
ఆర్ట్ డైరెక్టర్: శివ కామేష్ డి
ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు: శరణ్య పోట్ల, అజయ్ గద్దె
PRO: వంశీ-శేఖర్
మార్కెటింగ్: హాష్‌ట్యాగ్ మీడియా

- Advertisement -
RELATED ARTICLES

Latest News