- మోతిగల్లి ప్రభుత్వ హోమియోపతి ఆసుపత్రిలో నిర్వహణ..
- అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా..
- ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్న సూపరింటెండెంట్ డాక్టర్ పి. లక్ష్మి దేవి.
అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా “ఆరోగ్యకర వృద్ధాప్యం” అనే అంశంపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. పి. లక్ష్మీదేవి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యోగా అనేటిది కేవలం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడడమే కాకుండా, వృద్ధాప్యంలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
క్రమం తప్పకుండా యోగా, ధ్యానం, ఆరోగ్యకర జీవనశైలిని అనుసరించడం ద్వారా ఆరోగ్యవంతమైన, ఆనందకరమైన వృద్ధాప్యాన్ని పొందవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ డా: లక్ష్మీదేవితో పాటు వైద్యులు డా: కె. జ్యోతి, డా: పి. రాధాకృష్ణ, ఫార్మసిస్ట్ నవనీత వరలక్ష్మి, గంగమ్మ, అస్లం పాల్గొన్నారు. జూనియర్ వైద్యులు డా : ప్రణయ్ సాగర్, డా : సాయిలక్ష్మి, డా : వర్ష, డా: నాధా కీలక పాత్ర పోషించారు.
వైద్యులు యోగా యొక్క ప్రాముఖ్యత, దాని వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి వివరించి, ప్రజలు తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పాల్గొన్నవారందరూ యోగా సాధన చేసి, ఆరోగ్యకర జీవన విధానాన్ని పాటించాలని ప్రతిజ్ఞ చేశారు.
