టీపీసీసీ జనరల్ సెక్రటరీ చనగాని దయాకర్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో (Jubilee Hills bye-election) కాంగ్రెస్ పార్టీ (Congress Party Victory) విజయాన్ని ఎవరూ ఆపలేరని టీపీసీసీ జనరల్ సెక్రటరీ (TPCC General Secretary) చనగాని దయాకర్ ధీమా వ్యక్తం చేశారు. ఫలితాలను తారుమారు కోసం కేకే సర్వే(KK Survey)తో కేటీఆర్ డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. కేకే సర్వేపై ఎలక్షన్ కమిషన్ తక్షణం స్పందించాలని కోరారు. కేకే సర్వే కేటీఆర్(Ktr)కు అమ్ముడుపోయిన సర్వే అని దుయ్యబట్టారు. బోగస్ సర్వే లను తెలంగాణ ప్రజలు నమ్మారని దయాకర్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధి, సంక్షేమం కోసం ఆలోచన చేస్తున్నారని, కేకే సర్వే ఇచ్చిన బోగస్ రిపోర్ట్‌పై చర్యలు తీసుకోవాలని అన్నారు.
