Homeహైదరాబాద్‌Addagutta | అడ్డగుట్ట సర్కార్ బడిని నీటి సమస్య పరిష్కరించాలి

Addagutta | అడ్డగుట్ట సర్కార్ బడిని నీటి సమస్య పరిష్కరించాలి

  • బీజేపీ అడ్డగుట్ట ఇన్ ఛార్జ్ గెల్లు ఉదయ్ యాదవ్
  • బడిని సందర్శించిన జలమండలి అధికారులు
  • సమస్యను వివరించిన బీజేపీ నేతలు

అడ్డగుట్ట ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో నెలకొన్న నీటి సరఫరా సమస్యను వెంటనే పరిష్కరించాలని బీజేపీ అడ్డగుట్ట డివిజన్ ఇన్ఛార్జి ఉదయ్ యాదవ్ డిమాండ్ చేశారు. జలమండలి అధికారులు, బాలల హక్కుల పరిరక్షణ వేదిక ప్రతినిధులు స్థానిక నేతలతో కలసి శుక్రవారం సందర్శించి సమస్య పరిష్కారం కోసం చర్చించారు. ఈ సందర్భంగా ఉదయ్ మాట్లాడుతూ సీఆర్పీఎఫ్ ప్రతినిధులు పీ ఎల్ ప్రవీణ్, లత తన దృష్టికి తీసుకు వచ్చారని తెలిపారు.

Addagutta school water supply2

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లగా వారు వెంటనే స్పందించి సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలని అధికారులకు లేఖ రాసారని పేర్కొన్నారు. సమస్య అతిత్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు హామీనిచ్చారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు సాయన్న, శ్యామల తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News