Tuesday, March 3, 2026
Homeహైదరాబాద్‌BJP | సీఎం రేవంత్‌పై ఈసీకి ఫిర్యాదు

BJP | సీఎం రేవంత్‌పై ఈసీకి ఫిర్యాదు

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎలక్షన్ కోడ్‌(Election Code)ను ఉల్లంఘించారని బీజేపీ(BJP).. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(CEO)కి గురువారం ఫిర్యాదు చేసింది. జూబ్లీహిల్స్ (JubileeHills) ఉపఎన్నిక(Bye Election) నేపథ్యంలో ఈసీ నిబంధనలను అతిక్రమించి ఒక వర్గం ఓటర్లను ప్రలోభపెడుతున్న సీఎంపై చర్యలు తీసుకోవాలని ఆ పార్టీ ప్రతినిధులు కోరారు. అజారుద్దీన్‌(Azaruddin)కి మంత్రి పదవి (Minister Post) ఇవ్వటం ద్వారా కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి లబ్ధి చేకూర్చాలని ప్రయత్నిస్తున్నట్లు టీవీ ఛానల్స్, న్యూస్ పేపర్లలో చూసి తెలుసుకున్నామని ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ ఎన్నికల సంఘం వ్యవహారాల కమిటీ చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి, కమిటీ మెంబర్ ఆంటోనీ రెడ్డి, అసెంబ్లీలో బీజేపీ పక్ష ఉపనేత పాయల్ శంకర్ ఈ ఫిర్యాదు అందజేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News