Wednesday, February 11, 2026
Homeమెదక్‌RTC Buss | ఆర్టీసీ బస్సు ఢీకొని 25 గొర్రెలు మృతి

RTC Buss | ఆర్టీసీ బస్సు ఢీకొని 25 గొర్రెలు మృతి

మెదక్ జిల్లా (Medak District) కొల్చారం (Kolcharam) మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు (RTC Buss) ఢీకొని 25 గొర్రెలు (Sheep) మృతి చెందాయి. బస్సు నర్సాపూర్ (Narsapur) నుంచి మెదక్ డిపో వైపు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో బస్సు అతివేగం(High Speed)గా ప్రయాణిస్తుండటంతో అదుపు తప్పింది. నారాయణపేట జిల్లా (Narayanapet District) జాజపురం గ్రామానికి చెందిన పుండుకూర నర్సింలు తన జీవాలను రోడ్డు మీద నుంచి పొలాల్లోకి దాటిస్తుండగా ప్రమాదం బారిన పడ్డాయి. దీంతో.. తనకు సుమారు 2 నుంచి 3 లక్షల వరకు నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్ఐ మొహమ్మద్దీన్ ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రయాణికులకు ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకపోవటంతో (Passengers Safe) అందరూ ఊపిరిపీల్చుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News