Wednesday, March 4, 2026
Homeఆరోగ్యంBlood Donation | ఓయూలో మెగా రక్తదాన శిబిరం

Blood Donation | ఓయూలో మెగా రక్తదాన శిబిరం

సికింద్రాబాద్: పోలీస్‌ అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జరుగుతున్న వారోత్సవాల్లో భాగంగా ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీ (Osmania University) నాన్ టీచింగ్ (Non Teaching) ఫంక్షన్ హాల్ లో మెగా రక్తదాన శిబిరాన్ని (Mega Blood Donation Camp) నిర్వహించారు. ఈస్ట్ జోన్ అడిషనల్ డీసీపీ నర్సయ్యా, ఓయూ ఎసిపి జగన్ ఇతర సిబ్బంది కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.

ఈ రక్తదాన శిబిరంలో పోలీస్‌ సిబ్బంది, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు(Students), యువకులూ (Youth) భారీగా పాల్గొని రక్తాన్ని అందించారు. అడిషనల్ డీసీపీ నర్సయ్యా మాట్లాడుతూ రక్తదానం మహాదానం అని ఆపద సమయంలో ప్రాణదానంగా ఈ రక్తదానం ఉపయోగపడుతుందన్నారు. ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని సూచించారు. ఈస్ట్ జోన్ లో రెండు చోట్ల రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని, దాదాపు 1000 యూనిట్ల సేకరించి పేదవారికి ఉపయోగపడే విధంగా బ్లడ్ బ్యాంక్(Blood Bank)లకు అందిస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News