No menu items!
No menu items!
Tuesday, September 17, 2024
spot_img
No menu items!

తుఫాన్‌ వాహనాన్ని ఢీకొట్టిన లారీ.. ఐదుగురు దుర్మరణం

తప్పక చదవండి

కడప : ఆంధప్రదేశ్‌ లోని అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కేవీపల్లి మండలం మఠంపల్లి దగ్గర ఎదురెదురుగా వచ్చిన తుఫాన్‌ వాహనం, లారీ ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో తుఫాన్‌ వాహనంలో ప్రయాణిస్తున్న ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స కోసం తిరుపతిలోని రుయా అసుపత్రికి తరలించారు. బాధితులు తిరుమలకు వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులంతా కర్ణాటక రాష్ట్రం బెళగావి వాసులు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు