- రాష్ట్ర ఖజానాకు వేలకోట్ల ఇన్కమ్ అందించే మండలం శేరిలింగంపల్లి..
- ఇప్పటికీ ఒకే మండలంగా కొనసాగుతున్న రెవెన్యూ పరిపాలన..!
- భారీ జనాభాకు కొరవడిన పరిపాలనా వ్యవస్థ
- సిబ్బంది కొరతతో ఆక్రమణదారులకు అడ్డుకట్టవేయలేకపోతున్న వైనం..
- అభివృద్ధికి కేరాఫ్ శేరిలింగంపల్లి..
- పరిపాలనలో ఆదర్శంగా నిలుస్తుందా..?
శేరిలింగంపల్లిలో పరిపాలనా సవాళ్లు ఎన్నెన్నో ఎదురవుతు న్నాయి.. భారీ జనాభాకు తగిన పరిపాలనా వ్యవస్థ లేక పోవడం.,రెవెన్యూ సిబ్బంది కొరత,పూర్తి స్థాయి సర్వేయర్ లేక ఇన్చార్జ్ వ్యవస్థపై ఆధారపడడం,వేల సంఖ్యలో భూ వివాదాల పెండెన్సీ,కోర్టు కేసులకు సమయానికి కౌంటర్లు దాఖలు చేయడంలో ఆలస్యం, ప్రభుత్వ భూముల రక్షణపై ఒత్తిడి, ప్రజల కు సేవలందించడంలో జాప్యం,అధికారులపై కోర్టు, రెవెన్యూ, ప్రభుత్వ కార్యక్రమాల పని భారం అధికంగా ఉండటం.
స్థానికంగా వినిపిస్తున్న అభిప్రాయాలు :
- మండలం పెద్దదిగా ఉండడం వల్ల భూ వివాదాల పరిష్కారం ఆలస్యమవుతోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
- కోర్టు కేసులకు సమయానికి కౌంటర్లు దాఖలు కాకపోవడం వల్ల ప్రభుత్వ భూముల పరిరక్షణ మరింత బలపడాల్సిన అవసరం ఉందని న్యాయవాదుల వర్గాలు చెబుతున్నాయి.
- రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరత కారణంగా ప్రజలకు సేవలు ఆలస్యమవుతున్నాయని స్థానికులు అంటున్నారు.
- పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పరిపాలనా వ్యవస్థను విస్తరించాల్సిన అవసరం ఉందని మాజీ అధికారులు కూడా అభిప్రాయపడుతున్నారు. రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరత కారణంగా లక్షలకొట్ల ప్రభుత్వ భూములను అక్రమనదారుల నుండీ కాపాడలేక పోతున్నారని, దానితో కొంత మంది సిబ్బందికి, అక్రమణదారుల కు మూడు పువ్వులు ఆరు కాయలుగా వికసిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి .

చర్చకు దారితీస్తున్న అనుమానాలు :
- “రాష్ట్రంలో దాదాపు అన్ని పెద్ద మండలాలను
విభజించినప్పుడు శేరిలింగంపల్లిని ఎందుకు
మినహాయించారు…….?” - “వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు, సంక్లిష్టమైన
భూ వ్యవహారాలు ఉన్న ప్రాంతంలో పరిపాలనా వికేంద్రీకరణ
ఎందుకు జరగలేదు…..?” - “మండల విభజన ఆలస్యం వల్ల ఎవరికి ప్రయోజనం, ఎవరికి నష్టం…..?” అనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. ఈ అభిప్రాయాలు ప్రజల్లో జరుగుతున్న చర్చలు .

వాస్తవంగా చూస్తే :
- శేరిలింగంపల్లి రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందిన మండలాల్లో ఒకటి.
- జనాభా, ఆర్థిక కార్యకలాపాలు, భూముల విలువ, ప్రభుత్వ ఆస్తుల పరంగా ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంది.
- రెవెన్యూ పరిపాలనపై భారీ ఒత్తిడి ఉందని అధికారులు కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించారు.
- భూ వివాదాల సంఖ్య గణనీయంగా ఉండటం వల్ల పరిపాలనా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని తెలుస్తుంది .
ప్రభుత్వం ముందున్న కీలక ప్రశ్నలు ….
నిపుణులు సూచిస్తున్న మార్గాలు :

- ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రధాన ప్రశ్న ఒక్కటే…ఇంత పెద్ద జనాభా… ఇంత భారీ రెవెన్యూ… ఇంత విలువైన ప్రభుత్వ భూములు… ఇంతటి అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన శేరిలింగంపల్లి మండలాన్ని రెండు లేదా మూడు మండలాలుగా విభజించే అవకాశాలను పరిశీలించాలి…..?
- లేక ప్రజల అవసరాలు, పరిపాలనా సౌలభ్యం, భూ రక్షణ, సేవల వేగవంతత దృష్ట్యా కొత్త మండలాలుగా విభజించి పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు అదనపు తహసీల్దార్ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి.
- పూర్తి స్థాయి సర్వేయర్లు, రెవెన్యూ సిబ్బందిని నియమించాలి.
- ప్రభుత్వ భూముల పరిరక్షణకు ప్రత్యేక సెల్ ఏర్పాటు చేయాలి.
- కోర్టు కేసుల పర్యవేక్షణకు ప్రత్యేక లీగల్ బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వం, సంబంధిత విధాన నిర్ణేతలే.
ప్రపంచ స్థాయి పెట్టుబడులు, లక్షలాది జనాభా, వేల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వ్యాపార కేంద్రాలు ఒకే మండల పరిధిలో ఉండటం శేరిలింగంపల్లి ప్రత్యేకత. అదే సమయంలో పరిపాలనా అవసరాలు కూడా గణనీయంగా పెరిగాయి.ఇలాంటి పరిస్థితుల్లో శేరిలింగంపల్లి మండల విభజన అవసరం …. ప్రభుత్వం సమగ్ర అధ్యయనం చేపట్టి, ప్రజల ప్రయోజ నాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసు కోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం స్థానికంగా వ్యక్తమవుతోంది.
అభివృద్ధికి చిహ్నమైన శేరిలింగంపల్లి… పరిపాలనలోనూ ఆదర్శంగా నిలిచే రోజు ఎప్పుడు? అన్న ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చే సమాధానం కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు.శేరిలింగంపల్లి మండలంలోని ప్రభుత్వ భూముల చరిత్ర.. అత్యంత విలువైన రెవెన్యూ గ్రామాలు.. భూ వివాదాల స్వభావం.. పరిపాలనా లోపాలపై నిపుణుల విశ్లేషణ.. మండల విభజన జరిగితే సాధ్యమైన కొత్త మండలాల నమూనా.. ఈ విషయాలపై వివరణాత్మక కథనాన్ని వచ్చే సంచికలో మీముందుకు తీసుకురానుంది “ఆదాబ్ హైదరాబాద్”..
