Homeరంగారెడ్డిDonation | మజీద్‌పూర్ పాఠశాలకు 110 బ్యాగులు, ప్రింటర్ డొనేట్

Donation | మజీద్‌పూర్ పాఠశాలకు 110 బ్యాగులు, ప్రింటర్ డొనేట్

  • పిల్లల ముఖాల్లో చిరునవ్వులు చూడటానికి మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుంది.
  • చారిటీ సభ్యులైన కొలం మధూకర్ రెడ్డి, భరత్, రాజేష్, రజినీకాంత్ అన్నారు

అబ్దుల్లాపూర్ మెట్టు మండలం, మజీద్ పూర్ గ్రామం లో మండల ప్రజా పరిషత్ స్కూల్ కి 110 స్కూల్ బ్యాగ్స్, 30 వేల రూపాయల విలువ చేసే ఒక ప్రింటర్ ని 100 స్మైల్స్ చారిటీ ఫౌండేషన్ వారి సహకారంతో డొనేట్ చేయడం జరిగింది. ఈ సందర్బంగా చారిటీ సభ్యులైన కొలం మధూకర్ రెడ్డి, భరత్, రాజేష్, రజినీకాంత్ లు మాట్లాడుతూ…

పిల్లల మొఖాల్లో చిరునవ్వులు చూడడానికి మా వంతు సహకారం ఎప్పుడు ఉంటుందని, పాఠశాలకు కావలసిన 5 కంప్యూటర్స్, అల్మారా, నవోదయ గురుకులం వంటి పోటీపరీక్షల స్టడీ మెటీరియల్ సమాకూరుస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మజీద్ పూర్ గ్రామ సర్పంచ్ మేడిపల్లి ప్రియా చంద్రశేఖర్, వార్డ్ సభ్యులు పాలపాటి నర్సింహ్మ, నాగరాజు, సత్తయ్య, పాఠశాల హెడ్ మాస్టర్ మహేష్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, వెంకటేష్, సభిత, లహరి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News