Sunday, June 21, 2026
HomeసినిమాToxic | ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న ‘టాక్సిక్’ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్

Toxic | ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న ‘టాక్సిక్’ మూవీ రిలీజ్ డేట్ పోస్టర్

రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ ఏర్పడిన అంచనాలు, వరల్డ్ వైడ్‌గా ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజ్ డేట్‌ను తాజాగా ప్రకటించారు. ఫాదర్స్ డే సందర్భంగా ఓ స్పెషల్ పోస్టర్‌ను రివీల్ చేస్తూ ఆగస్ట్ 26న సినిమాని రిలీజ్ చేయబోతోన్నట్టుగా ప్రకటించారు. ఇక ఈ పోస్టర్‌ను గమనిస్తే యశ్ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్నారు. సరికొత్త సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ అందించేలా ‘టాక్సిక్’ను రూపొందించారు.

వరమహాలక్ష్మి, ఓనం, ఈద్, రక్షాబంధన్ వంటి పండుగలతో పాటు లాంగ్ వీకెండ్, సెలవుల్ని సద్వినియోగం చేసుకోవాలని టీం ఫిక్స్ అయింది. దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ‘టాక్సిక్’కి పెరిగిన డిమాండ్‌తో లాంగ్ వీకెండ్, పండుగ సీజన్లు బాగానే కలిసి వస్తాయని మేకర్స్ భావిస్తున్నారు.

- Advertisement -

‘టాక్సిక్’ గ్లింప్స్, టీజర్, పోస్టర్లు, ఆర్టిస్టుల కారెక్టర్ ఫస్ట్ లుక్ పోస్టర్లు అన్నీ కూడా ప్రాజెక్ట్ మీద హైప్‌ను పెంచేశాయి. ప్రఖ్యాత దర్శకురాలు గీతూ మోహన్‌దాస్, రాకింగ్ స్టార్ యశ్ కాంబోలో రానున్న ఈ మూవీని కేవీఎన్ ప్రొడక్షన్స్, యశ్ స్వీయ బ్యానర్ మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మిస్తున్నాయి.

కన్నడ, ఆంగ్ల భాషలలో ఏకకాలంలో చిత్రీకరించబడిన ‘టాక్సిక్’ వరల్డ్ వైడ్‌గా అన్ని ప్రాంతాలకు చెందిన ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. అందుకే ఈ మూవీని కన్నడ, హిందీ, ఆంగ్లం, తెలుగు, తమిళం, మలయాళ భాషలలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా తదితరులు అద్భుతమైన పాత్రల్ని పోషించారు.

ఈ ఏడాది రానున్న క్రేజీ ప్రాజెక్టుల్లో ‘టాక్సిక్’ ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రిలీజ్ డేట్ ప్రకటించడంతో అందరి దృష్టి ఈ చిత్రంపైనే పడింది. బుధవారం రిలీజ్ అవుతుండటం, లాంగ్ వీకెండ్ దొరకడం, పైగా ఫెస్టివల్ సీజన్ కావడంతో భారీ రేంజ్‌లో ఓపెనింగ్స్, కలెక్షన్స్ వస్తాయని అంతా భావిస్తున్నారు.

కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ నిర్మించిన ‘టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్’ చిత్రం 2026 ఆగస్టు 26 (బుధవారం)న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News