Homeనల్లగొండYadagirigutta | అర్చకుల నుండి ముఖ్య అర్చకునిగా పదోన్నతి

Yadagirigutta | అర్చకుల నుండి ముఖ్య అర్చకునిగా పదోన్నతి

  • స్వామివారి కైంకర్యాలలో ప్రముఖ పాత్ర వహించినందుకుగాను
  • సేవలను గుర్తించి ముఖ్య అర్చకునిగా గుర్తింపు

యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో అర్చకులుగా విధులు నిర్వహిస్తున్న వుండ్రకింద కిరణ్ కుమార్ చార్యులకు పదోన్నతి లభించింది. ప్రధాన ఆలయంలో,మరియు దేశ విదేశాలలో ఇతర ప్రాంతాలలో స్వామి వారి వైభవాన్ని తెలిపి నిత్య కైంకర్యాలు, పాంచరాత్రాగమ రీత్యా పూజలు నిర్వహిస్తున్నందుకుగాను ఆలయ ఈవో భవాని శంకర్, కిరణ్ కుమారాచార్యులకు అర్చకుల హోదా నుండి ముఖ్య అర్చకునిగా పదోన్నతిని కల్పిస్తూ బ్రహ్మోత్సవాల మొదటి రోజుననే నియామక పత్రాన్ని అందించారు.

Kiran Kumar Chary Promoted as Chief Priest

ఈ సందర్భంగా కిరణ్ కుమారాచార్యులు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల మొదటి రోజున పదోన్నతి లభించడం ఆనందంగా ఉందని స్వామివారికి చేసిన సేవనే గుర్తింపుగా తనకు అవకాశం లభించిందని అన్నారు.ఈ సందర్భంగా ఆలయ ఈవో భవాని శంకర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.ఆలయ అర్చకులు పదోన్నతి పొందిన కిరణ్ కుమారా చార్యులను అభినందించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News