Friday, April 24, 2026
Homeఆదిలాబాద్Nari Shakti | మహిళా బిల్లును ఆమోదించాలి

Nari Shakti | మహిళా బిల్లును ఆమోదించాలి

నరేంద్ర మోడీ ప్రభుత్వం చట్టసభలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలనే ఉద్దేశంతో నారి శక్తి వందన్ పేరుతో మహిళలకు తీసుకువచ్చిన రిజర్వేషన్ బిల్లును లోక్ సభలో పాస్ కాకుండా కాంగ్రెస్ పార్టీ మరియు మిత్రపక్షాలు అడ్డుకోవడానికి ఖండిస్తూ బిజెపి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్ పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం మహిళలకు రిజర్వేషన్లు కల్పించాలని ఉద్దేశంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ బిల్లును రేవంత్ రెడ్డి సర్కార్ వ్యతిరేకించడాన్ని ఆయన తీవ్రంగా తప్పు పట్టారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు మహిళలకు అనేక మైనటువంటి హామీలను ఇచ్చి ఏ ఒక్కటి నెరవేర్చలేదన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించడాన్ని ఓర్వలేక అడ్డుకున్నారని రేవంత్ రెడ్డి సర్కార్కు మహిళలంటే ఎందుకంత భయం ప్రశ్నించారు. రిజర్వేషన్ అమలు అయితే తెలంగాణలో 60 మంది మహిళలకు ఎమ్మెల్యేలుగా మరియు 9 మంది మహిళలకు ఎంపీలుగా అవకాశం ఉండేదని, కాంగ్రెస్ పార్టీ బిల్లును వ్యతిరేకించడం పట్ల మహిళలు ఈ అవకాశాన్ని కోల్పోయారు అని ఆయన పేర్కొన్నారు.

- Advertisement -

కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ నుండి మొదలుకొని రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ యొక్క బిల్లు పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారనీ మండిపడ్డారు.రిజర్వేషన్ బిల్లు 1996 నుంచి ఇప్పటివరకు పార్లమెంటులో 8సార్లు ప్రవేశపెట్టడం జరిగిందని బిల్లును ప్రవేశపెట్టిన ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ మరియు వారి మిత్రపక్షాలు అడ్డుకున్నాయని,అంతేకాకుండా బిల్లు ప్రతులను చింపేసిన దాఖలాలు కూడా ఉన్నాయని గుర్తు చేశారు .కాంగ్రెస్ పార్టీ గత 60 సంవత్సరాలు దేశంలో అధికారంలో ఉండి ఏనాడు కూడా మహిళలకు చట్టసభలలో 33% రిజర్వేషన్ లు ఇవ్వాలని ఎన్నడూ ప్రయత్నం చేయకపోగా,బిల్లు వీగిపోయేలా కుట్రలు మాత్రం చేసిందని విమర్శించారు.

2023లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మొదటిసారిగా ఈ బిల్లును ప్రవేశపెట్టారన్నారు.అప్పుడు కేవలం న్యాయపరమైన మరియు రాజ్యాంగబద్ధమైన బిల్లును ప్రవేశ పెట్టారన్నారు.సెన్సెస్ ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని గ్రహించి అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగాలని ఉద్దేశంతో ప్రతి రాష్ట్రంలో 50% సీట్లను పెంచుతూ ఈ యొక్క డీలిమిటేషన్ బిల్లును తీసుకొచ్చారన్నారు. 1953లో డీలిమిటేషన్ జరిగితే ఎనిమిది సీట్లు పెరిగాయని అందులో 7 సీట్లు ఉత్తరభారతదేశం లో పెరిగితే కేవలం ఒక సీటు మైసూర్ మాత్రమే దక్షిణాదిలో పెరిగిందన్నారు.

మళ్లీ పది సంవత్సరాల తర్వాత డీలిమిటేషన్ జరిగితే 27 సీట్లు ఉత్తరాదిలో పెరుగుతే కేవలం రెండు సీట్లు మాత్రమే దక్షిణ భారతదేశంలో పెరిగాయన్నారు.1973 లో మళ్లీ డీలిమినేషన్ జరిగితే ఉత్తర భారత దేశంలో 17 పెరిగితే దక్షిణాదిలో కేవలం మూడు మాత్రమే పెరిగాయి అన్నారు. ఈసారి కూడా సెన్సెస్ ఆధారంగా డీలిమిటేషన్ చేస్తే సీట్లు అన్నీ కూడా ఉత్తరాదిన పెరుగుతాయని దీన్ని గమనించి కేంద్ర ప్రభుత్వం సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రాష్ట్రాలకు సమన్యాయం జరగాలనీ ఆయా రాష్ట్రాలకు 50 శాతం సీట్లు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టడం పట్ల కాంగ్రెస్ పార్టీ మరియు దాని మిత్రపక్షాలకు అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు.

రాబోయే ఎన్నికల్లో మహిళలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్తారు అన్నారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ ఫ్లోర్ లీడర్ ముకేష్ గౌడ్, కార్పొరేటర్ అనిత, బీజేపీ నాయకులు వెంకటేశ్వరరావు, కృష్ణమూర్తి, వెంకటకృష్ణ, ఆంజనేయులు, స్వాతి, సుజాత, స్వప్న, రజిత, సరుతారెడ్డి, జయరాం రావు,రాజు కుమార్, స్వామి రెడ్డి మరియు ఇతర బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News