తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రశ్న
కాంగ్రెస్ పార్టీ(Congress Party)కి చెందిన మహబూబ్‌నగర్(Mahabubnagar) ఎమ్మెల్యే (Mla) యెన్నం శ్రీనినాస్‌రెడ్డి (Yennam Srininas Reddy) ఇప్పుడు ఏ రాజకీయ పార్టీలో ఉన్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు (Telangana Jagruti President) కవిత (Kavitha) ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారా లేక బీజేపీ(BJP)లోకి వెళ్లిపోయారా అని ఎద్దేవా చేశారు. జనం బాట (Janam Baata) కార్యక్రమంలో భాగంగా ఆమె ఈ రోజు మహబూబ్‌నగర్‌లో మీడియాతో మాట్లాడారు.

సీఎం రేవంత్‌పై మండిపడ్డారు. సామాన్యులకు వైద్యం అందించలేని స్థితిలో ప్రభుత్వం ఉందని విమర్శించారు. విద్యార్థులుకు ఫీజులు చెల్లించకపోవటంతో వాళ్లందరూ కాలేజీలకు వెళ్లకుండా ఇళ్లల్లోనే ఉంటున్నారని కవిత అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని తక్షణం పూర్తిచేయకపోతే ఆ నీటిని పక్క రాష్ట్రం ఏపీ తరలించుకొనిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ నెల 26న నిజామాబాద్ జిల్లాలో ప్రారంభమైన జనం బాట పాదయాత్ర 33 జిల్లాల్లోని 119 నియోజకవర్గాల్లో జరుగుతుంది.
