మొంథా తుఫాన్ ప్రభావంతో విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కూసుమంచి మండలంలోని పంటలు నీట మునిగిపోయాయి.ఆరుగాలం శ్రమించి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలకి నేలమట్టం కావడంతో రైతులు లబోదిబోమంటున్నారు.మండల వ్యాప్తంగా వందల ఎకరాల్లో వరి,పత్తి,మిరప పంటలు తుఫాన్ తాకిడికి నీట మునిగి రైతులకి అపార నష్టాన్ని మిగిల్చాయి.మండల వ్యవసాయాధికారిణి రామడుగు వాణి బుధవారం జుజ్జుల్ రావుపేట గ్రామంలో నీట మునిగిన వరి పంటను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
నీట మునిగిన పంటను కాపాడుకునేందుకు రైతులకి ఆమె తగు సూచనలు చేశారు.బాధిత రైతులు పంట నష్టం పై అంచనా వేసి తమని ఆదుకోవాలని వ్యవసాయాధికారిణి కి విన్నవించగా ఉన్నతాధికారులకి నష్టపోయిన పంట పై పూర్తి వివరాలతో నివేదికను అందిస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏఈఓ నవీన్,రైతులు బాదావత్ శ్రీనివాస్,బాదావత్ కపిల్,దాసరి గోపి,బాదావత్ సైదులు,బాదావత్ నరేష్ తదితరులు పాల్గొన్నారు .
