- ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్s
- మట్టి గణపతులనే పూజించాలని పిలుపు
సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి (Vinayaka Chavithi Celebrations) వేడుకలు ఘనంగా జరిగాయి. క్యాంపు కార్యాలయంలో కొలువుదీరిన గణనాథుడికి స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించి, పుష్పార్చన చేశారు.
ఈ సందర్భంగా ఆయన ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. విఘ్నేశ్వరుడి కృపతో అందరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు నిండాలని ఆకాంక్షించారు. పర్యావరణ హితం కోసం ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులనే పూజించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీహరి, చింతా సాయినాథ్, కొండల్ రెడ్డి, జీవీ శ్రీనివాస్, గోవర్ధన్ రెడ్డి, విరల్, ఆంజనేయులు, శ్రవణ్ రెడ్డి, హరిప్రసాద్, రవి తదితర బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

