Homeఆదాబ్ ప్రత్యేకంMVSR Engineering College | ఎంవీఎస్ఆర్ లో సీట్ల దందా…?

MVSR Engineering College | ఎంవీఎస్ఆర్ లో సీట్ల దందా…?

‘బి’ కేటగిరీ సీటుకు రూ.7 లక్షల డిమాండ్..
రూ.3 వేల అప్లికేషన్ ఫీజు వసూలు

  • 30% ‘బి’ కేటగిరీ సీట్ల భర్తీలో నిబంధనల ఉల్లంఘనలు..
  • విద్యార్థి 85% మార్కులతో దరఖాస్తు.. జూలై 4న రూ.3,000 స్వీకరణ..
  • సెప్టెంబర్ 23న టీజీసీహెచఈ చైర్మన్‌కు బాధితుడి ఫిర్యాదు..
  • విద్యార్థి సంఘాల వరుస ఫిర్యాదులతో కాలేజీ వ్యవహారంపై వివాదం..
  • కాలేజీ గుర్తింపు రద్దు చేసి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్
  • లేకుంటే ఉన్నత విద్యామండలి కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరిక

రాష్ట్రంలోని ప్రఖ్యాత విద్యాసంస్థల్లో ఒకటైన ఎంవీఎసఆర్ ఇంజనీరింగ్ కళాశాల(MVSR Engineering College) యజమాన్యం అక్రమ దందాలు రోజురోజుకు మితిమీ రుతున్నాయి. నిబంధనలను గాలికొదిలి, విద్యను పూర్తిగా వ్యాపా రంగా మారుస్తున్న ఈ కళాశాల తీరుపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. విద్యార్థులకు రంగురంగుల ఆకర్ష ణీయమైన బ్రోచర్లతో గాలం వేస్తూ, విద్యాధికులైన తల్లిదండ్రులను ఈ కాలేజీ యజమాన్యం నిలువునా మోసం చేస్తోంది.

- Advertisement -

ఎంవీఎసఆర్ ఇంజనీరింగ్ కాలేజీలో(MVSR Engineering College) సీట్ల కేటాయింపులో తీవ్రమైన అవకతవకలు జరుగుతున్నాయి. విద్యార్థుల నుండి కేవలం అడ్మిషన్ అప్లికేషన్ పేరుతో రూ. 3,000/- చొప్పున భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక విద్యార్థి నుండి దరఖాస్తు రుసుమును అధికారికంగా స్వీకరిం చినప్పటికీ, నిబంధనల ప్రకారం మెరిట్ ఉన్న ఆ విద్యార్థికి సీటు కేటాయించకుండా కాలేజీ యజమాన్యం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది.

MVSR Engineering College B Category Seat Allegations2

నిబంధనలకు విరుద్ధంగా ‘బి’ కేటగిరి సీట్ల అమ్మకం : నిబంధనల ప్రకారం 30% ‘బి’ కేటగిరి సీట్లు కూడా మెరిట్ ప్రాతిపదికన మాత్రమే భర్తీ చేయాల్సి ఉంటుంది. కానీ, ఎంవీ ఎసఆర్ యజమాన్యం ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి, ‘బి’ కేటగిరి సీట్లను ఏమాత్రం పట్టించుకోకుండా, దానికి అద నంగా ఏకంగా రూ. 7,00,000/- (ఏడు లక్షల రూపాయలు) నగదు డొనేషన్ ఇస్తేనే సీటు ఇస్తామంటూ బరితెగించి డిమాండ్ చేస్తోంది. ప్రతిభను నమ్ముకుని వచ్చిన ఒక విద్యార్థి భవిష్యత్తుతో చెలగాటమాడుతూ, సీట్లను ఇష్టమెచ్చిన వారికి లక్షల రూపాయల డొనేషన్లకు బహిరంగంగా అమ్ముకుంటున్నారు.

అంతేకాకుండా, నచ్చిన వారికే సీట్లు కేటాయించాల నుకున్న ప్పుడు విద్యార్థుల నుండి అప్లికేషన్ ఫీజుల రూపంలో డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. సీటు కేటాయించని విద్యార్థులకు అడ్మిషన్ అప్లికేషన్ పేరుతో తీసుకున్న ఆ డబ్బులను తిరిగి చెల్లించ కుండా కాలేజీ మోసాలకు పాల్పడుతోంది.

ఉన్నత విద్యామండలి నామమాత్రపు నోటీసులు : ఇంత బహిరంగంగా దోపిడీ జరుగుతున్నా కూడా, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్ట రెడ్డి మరియు సెక్రటరీ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేష్‌లు నామమాత్రపు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకోవడం అత్యంత శోచనీయం. ఎంవీఎసఆర్ ఇంజనీ రింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ & మెషిన్ లెర్నింగ్) బ్రాంచ్‌లో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకున్న గౌతమ్ అనే విద్యార్థి ఇంటర్మీడియట్‌లో 850/1000 (85%) మార్కులు సాధించి అద్భుతమైన మెరిట్ కలిగి ఉన్నాడు.

కాలేజీ యజమాన్యం జూలై 4, 2026 నాడే అప్లికేషన్ నెం. 189 కింద గౌతమ్ వద్ద రూ. 3,000/- దరఖాస్తు రుసుమును కూడా అధికారికంగా స్వీకరించింది. కానీ నిబంధనల ప్రకారం మెరిట్ ఉన్న ఆ విద్యార్థికి సీటు కేటాయించకుండా యజమాన్యం అదనంగా రూ. 7 లక్షలు డిమాండ్ చేసింది. సెప్టెంబర్ 23, 2026 నాడు టీజీసీహెచఈ చైర్మన్‌కు బాధితుడు గౌతమ్ నేరుగా ఫిర్యాదు చేశాడు. కాలేజీలోని పలు విద్యార్థి సంఘాలు కూడా దీనిపై తీవ్రంగా స్పందించి ఫిర్యాదులు చేశాయి.

MVSR Engineering College B Category Seat Allegations0

ఎంవీఎసఆర్ కాలేజీలో జరుగుతున్న ఈ అక్రమాలు, దందాలపై టీజీఎస్‌యూ, టీపీఎస్‌యూ, డీవైఎఫఐ మరియు ఎనఎస్‌యూఐ వంటి పలు విద్యార్థి సంఘాలు తీవ్ర ఆరోపణలు చేస్తూ ఉన్నత విద్యా మండలికి ఫిర్యాదు చేశాయి. ఆగస్ట్ 28, 2026 నాటి తొలి లేఖ ద్వారా సెప్టెంబర్ 04 లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించినా, సెప్టెంబర్ 15 నాటి తుది హెచ్చరిక లేఖకు కాలేజీ యజమాని ఎలాంటి వివరణ ఇవ్వకుండా ప్రదర్శించిన నిర్లక్ష్యాన్ని ఉన్నత విద్యామండలి పట్టించుకోలేదు.

ఆర్థిక నేరాలకు పాల్పడుతున్న వైనం : విద్యా వ్యవస్థలో సంచలన మార్పులు తీసుకొచ్చి, దానిని మెరుగుపరచడానికి రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గొప్ప సంకల్పంతో కృషి చేస్తున్నారు. కానీ, కళాశాల యజమాన్యాలు, వారికి సహకరిస్తున్న చైర్మన్ మరియు సెక్రటరీలు విద్యా వ్యవస్థకే మచ్చే తెచ్చే విధంగా విధులు నిర్వ హిస్తున్నారు. 30% బి కేటగిరి సీట్లకు లక్షల్లో డొనేషన్లు వసూలు చేస్తూ, విద్యను పూర్తిగా వ్యాపారంగా మార్చి సీట్లను బహిరంగంగా అమ్ముకుంటున్న ఈ కాలేజీ యజమాన్యం.. ప్రభుత్వానికి చెల్లించ వలసిన పన్నులను మాత్రం చెల్లించకుండా భారీ ఆర్థిక నేరాలకు పాల్పడుతోంది.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఎంవీఎసఆర్ ఇంజనీరింగ్ కాలేజీ గుర్తింపును రద్దు చేయాలని, యజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేనిపక్షంలో ఉన్నత విద్యామండలి కార్యాలయాన్ని ముట్టడించి పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాయి. కాలేజీ మేనేజ్‌మెంట్ కోట్లలో సాగిస్తున్న అక్రమ దందాలు, ఆర్థిక లావాదేవీలు, ప్రభుత్వానికి చెల్లించవలసిన పన్నుల ఎగవేతపై మరిన్ని ఆధారాలతో త్వరలోనే విచారణ జరిపించాలని బాధితులు కోరుతున్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News