టీపీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ 2 ఏళ్ల ప్రస్తానం
- కార్యకర్తల పక్షపాతిగా తన మార్క్ రాజకీయాలు..
- మహేష్ గౌడ్ నాయకత్వ ప్రతిభకు దక్కిన గౌరవం..
- సంస్థాగత నిర్మాణం, సామాజిక న్యాయం తెలిసిన నాయకుడు..
- తన స్థాయి చూసి ఏనాడూ గర్వపడని మహోన్నత వ్యక్తిత్వం..
- చిన్న స్థాయి కార్యకర్తను సైతం ఆప్యాయంగా పలుకరించే నైజం..
- అందరినీ కలుపుకునిపోయే అద్భుత మనస్తత్వం..
- కాంట్రవర్శీలకు వ్యతిరేకం, కమిట్మెంట్‌కు దాసోహం
- నమ్మిన సిద్ధాంతాలను తూ చ తప్పక పాటించే సుగుణం..
- సుదీర్ఘ రాజాకీయ జీవితంలో మచ్చలేని నాయకుడిగా ఉండటం ఆయనకే సాధ్యం
- మహేష్ కుమార్ విజయవంతమైన పొలిటికల్ జర్నీ ఆసక్తికరం..
ఎంత హుందాగా కనిపిస్తారో అంత ఉత్సాహంగా వుంటారు.. ఎంత గంభీరంగా కనిపిస్తారో అంత కరుణతో మెలుగుతారు.. ఆయన ముందు ఎవరు ఉన్నా, ఏస్థాయి వారైనా అందరినీ సమానంగా చూస్తారు.. అందరికీ సమానమైన గౌరవం ఇస్తారు.. ఆప్యాయంగా పలకరిస్తారు.. సమస్యలను సావధానంగా వింటారు.. తగిన పరిష్కారం చూపిస్తారు.. నాయకుడికి ఉండాల్సిన అన్ని లక్షణాలను ఆయన పుణికిపుచ్చుకున్నారు.. వివాదాలకు దూరంగా పార్టీ కార్యక్రమాలకు దగ్గరగా.. ప్రజా సమస్యలపై స్పందిస్తూ.. ఆ సమస్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తూ.. నమ్మిన ప్రజలకు భయంగా నిలుస్తూ.. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా..
అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కాంగ్రెస్ అధిష్టానం దృష్టిలోనూ ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకున్నారు.. రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రితో సమన్వయంతో మెలుగుతూ.. ఇటు పార్టీని అటు రాష్ట్ర ప్రజలను సైతం నిబద్ధతగా కాపాడుకుంటూ ముందుకు సాగుతున్న మహేష్ కుమార్ గౌడ్.. టీపీసీసీ అధ్యక్షుడిగా విజయవంతంగా 2 ఏళ్లు పూర్తిచేసుకున్నారు.. విపక్ష నాయకులను సైతం మైమరపించే స్నేహభావంతో.. చిరునవ్వుతో రిసీవ్ చేసుకునే ఔన్నత్యం ప్రదర్శిస్తూ.. నాయకుడు అనే పదానికి సరైన అర్ధం చెబుతూ.. నిదర్శనంగా నిలుస్తున్న మహేష్ కుమార్ గౌడ్ రెండేళ్ల టీపీసీసీ పొలిటికల్ జర్నీపై ఆదాబ్ అందిస్తున్న ప్రత్యేక కథనం..

అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ 2 ఏండ్ల విజయవంతమైన ప్రయాణంలో కార్యకర్తల, ప్రజల పక్షపాతిగా ఆయన మార్క్ రాజ కీయాలు ఎంతో ఆసక్తికరంగా ఉంటాయి.. ఆయన నాయకత్వ పటిమకు, కార్యకర్తల శ్రమకు దక్కిన అరుదైన గౌరవం టీపీసీసీ అధ్యక్ష పదవి.. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ చరిత్రలో ‘సంస్థా గత నిర్మాణం’, ‘సామాజిక న్యాయం’ రెండింటినీ సమర్థవంతంగా మేళవించిన అరుదైన నాయకుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్..(Mahesh Kumar Goud) ఈ 2 ఏండ్ల టీపీసీసీ అధ్యక్ష పాలనా కాలం ఎంతో ప్రత్యేకం.. సాధారణ కాంగ్రెస్ కార్యకర్తగా ప్రస్థానం ప్రారంభించి, పార్టీ సిద్ధాంతాలను నమ్ముకుని, ప్రతి సంక్షోభంలోనూ కాంగ్రెస్ జెండాను భుజాన ఎత్తుకున్న నాయకుడు ఆయన.. పీసీసీ అధ్యక్షుడిగా ఆయన క అందించిన ప్రస్థానం, ఆ పదవికే సరికొత్త వన్నె తెచ్చింది. కార్యకర్తల సేవకుడు, క్షేత్రస్థాయి పోరాటయోధుడు అయిన మాహేష్ నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్ నేడు సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది.
సామాజిక విప్లవానికి నాంది :
దేశంలోనే నెంబర్ 1 స్థానంలో బీసీ కులగణన! నిలిచింది.. అలాగే “జై బాపు.. జై భీమ్.. జై సంవిదాన్” అనే మూల సూత్రంతో కాంగ్రెస్ అధిష్టానం పిలుపునిచ్చిన చారిత్రాత్మక బిసి కులగణనను తెలంగాణలో అత్యంత విజయవంతంగా అమలు చేయడంలో టీపీసీసీ ముందు స్థానంలో నిలిచింది. పార్టీకి చెందిన ప్రతీ క్రియాశీలక నాయకుడు, కార్యకర్త క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలకు కులగణన ప్రాధాన్యతను వివరించారు. దేశంలోనే బిసి కులగణన నిర్వహణలో తెలంగాణను నెంబర్ 1 స్థానంలో నిలిపి, సామాజిక న్యాయ పోరాటంలో సరికొత్త అధ్యాయాన్ని మహేష్ కుమార్ నమోదు చేశారు.

ప్రజాక్షేత్రంలో ‘జనహితం’ :
గ్రామాల నుంచి గాంధీ భవన్ వరకు నిరంతర చైతన్యంతో ప్రజల నడుమ ఉంటూ, వారి కష్టసుఖాలను పంచుకోవడమే నిజమైన రాజకీయం అని నిరూపించిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి.. అందులో ముఖ్యంగా జనహిత పాదయాత్రలు.. రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా సాగిన పాదయాత్రల ద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య పటిష్టమైన వారధిగా నిలిచారు. గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖినిర్వహణ మరో ఎత్తు.. ప్రజా పాలన సాధించిన తర్వాత సాధారణ ప్రజలు, కార్యకర్తలు నేరుగా మంత్రులను కలసి సమస్యలు విన్నవించుకునేలా గాంధీ భవన్లో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసి రికార్డు సృష్టించారు.

ఎం.జీఎన్.ఆర్.ఈ.జీ.ఏ నిరసనలు
-వీబీ – జీ రామ్ జీ వ్యతిరేక తీర్మానాలు :
కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై, ఉపాధి హామీ చట్ట మార్పులపై ప్రతీ గ్రామంలో నిరసన జ్వాలలు ఎగిసిపడేలా చేసి, గ్రామ గ్రామానా తీర్మానాలు ఆమోదింపజేశారు.
ఓట్ చోరీ పై సంతకాల సేకరణ :
ప్రజాస్వామ్య హక్కులను కాపాడేందుకు ఓట్ల అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో భారీ సంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టారు.
సంస్థాగత పునర్నిర్మాణం:
‘సంఘటన్ సృజన్ అభియాన్’ విజయదుందుభి.. కాంగ్రెస్ పార్టీ ని క్షేత్రస్థాయిలో ఉక్కుకోటలా మార్చేందుకు రూపుదిద్దుకున్న ‘సం ఘటన్ సృజన్ అభియాన్’ రాష్ట్ర, జిల్లా, మండల కమిటీల నియా మకాలను పూర్తి చేసి, పార్టీ యంత్రాంగాన్ని పటిష్టం చేసింది.

ఏఐసీసీ పిలుపు ‘న్యాయ్ భోజ్:
సమాజంలోని పేద, వర్గీకృత వర్గాలకు అండగా నిలుస్తూ నిర్వహించిన ‘న్యాయ్ భోజ్’ కార్యక్రమం అపూర్వ విజయాన్ని అందుకుంది.
ఛాత్రోంకీ గూంజ్ :
విద్యార్థి, యువజన విభాగాన్ని చైతన్యపరుస్తూ చేపట్టిన ‘ఛాత్రోంకీ గూంజ్’ క్యాంపెయిన్ ప్రతి కళాశాల, విశ్వవిద్యాలయంలో కాంగ్రెస్ పతాకాన్ని ఎగరవేసింది.
జిల్లా అధ్యక్షులకు శిక్షణ శిబిరాలు :
పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వ పటిమ, డిజిటల్ నెట్వర్కింగ్ అంశాలపై డీసీసీ అధ్యక్షులకు ఉన్నత స్థాయి శిక్షణ తరగతులు నిర్వహించారు.
ఎన్నికల క్షేత్రంలో అజేయ సమరం :
ఎలక్షన్ మేనేజ్మెంట్లో రికార్డు అపూర్వ విజయం. సర్. ప్రక్రియలో దేశంలోనే టాప్ గా తెలంగాణను నిలిపారు.. పార్టీ నూతన సభ్యత్వ నమోదు, డేటా మేనేజ్మెంట్ ప్రక్రియను పూర్తి చేయడంలో తెలంగాణ టీపీసీసీ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ఏఐసీసీ ప్రశంసలు అందుకుంది.
ఎన్నికల ఫలితాల్లో తిరుగులేని ఆధిపత్యం :
ఇక జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నుంచి మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల వరకు కాంగ్రెస్ జెండాను విజయతీరాలకు చేర్చి మహేష్ కుమార్ తన సమర్థ నాయకత్వాన్ని నిరూపించుకున్నారు.
నాయకత్వానికి నిలువెత్తు నిదర్శనం :

గంప గోపాల్ అభినందన మందారం.. “ప్రజలతో, ప్రజల కోసం ఎల్లప్పుడూ శ్రమిస్తూ, వ్యవస్థను వ్యవస్థీకృతం చేయడం, బలహీన వర్గాలకు అధికారాన్ని అందించడం, చివరి వ్యక్తికి ఫలాలను అందించడం అనే త్రిసూత్ర సిద్ధాంతంతో పనిచేస్తున్న మహేష్ కుమార్ నాయకత్వం ఎంతో స్ఫూర్తిదాయకం. 2 సంవత్సరాల ఈ చారిత్రాత్మక నాయకత్వం, సంస్థాగత బలం, సామాజిక న్యాయ పోరాటం రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ సమర్థవంతమైన పాలనకు, పార్టీ పటిష్టతకు మరింత బలమైన పునాదిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.. తనదైన శైలిలో దూసుకుపోతున్న మహేష్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) భవిష్యత్తులో పార్టీని మరిన్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తాడు అన్నది వాస్తవం.. అదేవిధంగా ప్రజల బాగోగులు గమనిస్తూ వారికి అండగా నిలుస్తూ నిజమైన నాయకుడిగా ఆవిర్భవిస్తాడన్నది కూడా. రాజకీయ పండితుల అంచనా..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
