- వైద్యురాలి నిర్లక్ష్యం వల్ల నవజాత శిశువు మృతి
- పురిటిలోనే బిడ్డను కోల్పోయిన బాలింత
- డబ్బే మూలం… రోగిపై నిర్లక్ష్యం
నవమాసాలు నిండిన నవజాత శిశువు భూమి మీద అడుగు పెట్టకముందే వైద్యురాలి నిర్లక్ష్యం కారణంగా కన్నుమూసింది. పురిటిలోనే నవజాత శిశువు మృతి చెందడంతో ఆకుటుంబం విలపించింది. పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణీకి సరైన సమయంలో వైద్యం అందించి ఉంటే తాము బిడ్డను కోల్పోయేవాల్లం కాదంటూ బాధితులంతా నిరసనకు దిగారు. తమకు ఇంత అన్యాయం జరిగినా అదేమీ పట్టనట్లు ఆసుపత్రి యాజమాన్యం ఫీజు చెల్లించకపోతే వైద్యం అందిచమని అమానుషంగా ప్రవర్తించడం సరైంది కాదంటూ బాధితులు ఆరోపిస్తున్నారు. ఎన్నో ఆశలతో ఆసుపత్రికి వచ్చిన తమకు పుట్టింది మగ బిడ్డ అని తెలిసినా కానీ మృత శిశువు తమ చేతికి రావడంతో ఆకుటుంబం కన్నీరు మున్నీరైంది. సదరు ఆసుపత్రి భవన నిర్మాణం సమయంలో సైతం అనుమతులు లేకుండా నిర్మించారని ఆరోపణలు కోకోల్లలుగా ఉన్నాయి.

వైద్యురాలి ఆలస్యం నవజాత శిశువు కాలగర్భం..
పాల్వంచ పట్టణం నెహ్రునగర్‌కు చెందిన భవానీ అను గర్భిణీస్త్రీ ఈనెల 26న ఉదయం 4.30గంటలకు స్థానికంగా ఉన్న విజయ నర్సింగ్‌హోం హాస్పటల్‌కు వెళ్లారు. ఈనెల 21న డాక్టర్ విజయలక్ష్మీ భవానీ ఈనె30న డెలివరీ తేదీని చెప్పగా 26న తెల్లవారుజామున నొప్పులు ఎక్కువ కావడంతో విజయనర్సింగ్‌హోంకు వెళ్లి చేరింది. అనంతరం సిబ్బంది పరీక్షలు నిర్వహించి శిశువుకి హార్ట్‌బీట్ నెమ్మదిగా ఉందని డాక్టర్‌కి తెలియచేయడంతో ఇంజెక్షన్ వేయాలని సూచించారు డాక్టర్. గర్భిణీ భర్త క్రాంతి, అత్త లక్ష్మీకు సిబ్బంది ఇంజెక్షన్ వెయ్యాలంటూ సూచించారు.దానికి వారు అంగీకరించి ఇంజక్షన్ ఇప్పించిన అనంతరం పేషెంటుకు నొప్పులు ఎక్కువ కావడంతో మరోసారి సిబ్బంది డాక్టర్‌కు తెలియచేశారు.
డాక్టర్ ఆపరేషన్‌కు సిద్ధం చేయమని 7గంటలకు చెప్పిన డాక్టర్ మాత్రం 9.30సమయంలో రావడం ఆలస్యానికి మూలంగా నవ జాత శిశువు కాలగర్భంలో కలవడం జరిగింది. అసలు ఈ వైద్యురాలికి రెండు హాస్పటళ్లు కలిగి ఉండటంతో ఎక్కడా పూర్తి న్యాయం చేయలేక గర్భిణీస్త్రీలకు, నవజాత శిశువుకు ఇబ్బందులకు కలగడం జరుగుతుందని బాధితురాలు, భర్త, బంధువులు వాపోతున్నారు. డాక్టర్ వృత్తి గౌరవ ప్రదంగా ఉండాలేగాని, వీరి ఆలోచన అడ్డదారుల్లో తొక్కడంలో గనులు అనుకుంటూ అమ్మో విజయనర్సింగ్‌హోమ్ అంటేనే బెంబేలెత్తుతున్నారు పట్టణ ప్రజలు.నవ జాత శిశువు మృతికి కారణమైన డాక్టర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు,కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు.
