సత్తుపల్లి మునిసిపల్ ఆఫీసు (Municipal Office) ఎదురుగా ఏర్పాటుచేసిన ఏడు అడుగుల వంగవీటి మోహనరంగా(Vangaveeti Mohana Ranga) కాంస్య విగ్రహాన్ని ఆయన కుమారుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha Krishna)తో కలిసి సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య (Sandra Venkata Veeraiah) ఆదివారం ఆవిష్కరించారు. పట్టణంలోని మున్నూరు కాపు సంఘం(Munnurukapu Sangham), వంగవీటి మోహనరంగా యూత్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


