Homeమహబూబ్‌నగర్‌నేషనల్ టీచర్ ఇన్స్పిరేషన్ అవార్డు అందుకున్న వి జ్యోతిర్మయి..

నేషనల్ టీచర్ ఇన్స్పిరేషన్ అవార్డు అందుకున్న వి జ్యోతిర్మయి..

విద్యా రంగంలో విశిష్ట సేవలు అందించిన వారికి ఇచ్చే శారదా ఎడ్యుకేసినల్ సొసైటీ నేషనల్ టీచర్ ఇన్స్పిరేషన్ అవార్డు వనపర్తి జిల్లా జగత్ పల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న వి జ్యోతిర్మాయి అందుకున్నారు. ఆదివారం బిర్లా కాన్ఫరన్స్ హాల్ ప్లానిటో రియం హైదరాబాద్ లో అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ అవార్డును అందించి ఘనంగా సన్మానించారు.

V Jyotirmayi National Teacher Inspiration Award 1

ఆమె తయారు చేసిన సైన్స్ ప్రాజెక్ట్ జాతీయ స్థాయిలో హర్యానా రాష్ట్రంలోని పంచకులలో ఎంపిక కావడం పట్ల అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా రంగం లో తను చేసిన కృషి అభినందనీయమని ఇలాంటి ప్రాజెక్టులు మరిన్ని తయారుచేసి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అవార్డును హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడంతో జగత్ పల్లి ప్రధానోపాధ్యాయులు మంజుల, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News